Home
News

Poco M4 Pro 5G కొత్త ఫోన్ లాంచ్!! అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్స్...

షియోమి స్మార్ట్ ఫోన్ యొక్క సబ్-బ్రాండ్ పోకో సంస్థ నేడు ఇండియాలో పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను అందుబాటు ధరలో లాంచ్ చేసింది. ఈ కొత్త Poco ఫోన్ గత ఏడాది జూన్‌లో దేశంలో లాంచ్ అయిన పోకోM3 ప్రో 5Gకి అప్‌గ్రేడ్‌ వెర్షన్ గా వస్తుంది. కొత్త ఫోన్ గత సంవత్సరం మోడల్ కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్త పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ద్వారా శక్తిని పొందుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇతర ముఖ్యాంశాలలో 90Hz డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 8GB RAM వంటివి ఉన్నాయి. వివో T1 5G, రియల్ మి నార్జో 30 ప్రో, ఒప్పో A74 5G మరియు లావా అగ్ని 5G వంటి వాటికి పోటీగా లభించే వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Poco M4 Pro 5G ధర & లభ్యత వివరాలు

Poco M4 Pro 5G ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో పోకో M4 ప్రో 5G ఫోన్ మూడు వేరియంట్లాలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.14,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ ధర రూ.16,999 మరియు చివరిగా 8GB + 128GB టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.18,999. ఇది కూల్ బ్లూ, పోకో యెల్లో మరియు పవర్ బ్లాక్ వంటి కలర్ లలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ మొదటి సేల్ లో కొన్ని లాంచ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అయితే సంస్థ వాటి వివరాలను ఇంకా వివరించలేదు.

పోకో M4 ప్రో 5G స్పెసిఫికేషన్స్

పోకో M4 ప్రో 5G స్పెసిఫికేషన్స్

పోకో M4 ప్రో 5G కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12.5పై నడుస్తుంది. ఇది కొన్ని వారాల్లో MIUI 13 అప్‌గ్రేడ్‌ని కూడా అందుకోవచ్చని కంపెనీ వాగ్దానం చేసింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ డాట్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు DCI-P3 వైడ్ కలర్ గామట్‌ని కూడా కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద 8GB వరకు LPDDR4X ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 SoCని కలిగి ఉంది.

ఆప్టిక్స్

పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం 5G ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో జత చేయబడిన 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

స్టోరేజ్

పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికొస్తే 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. అలాగే మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 1TB వరకు విస్తరణకు మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో అమర్చబడి ఉంటుంది. అలాగే ఇది 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Poco M4 Pro 5G Smartphone Launched in India With 5000mAh Battery, 90Hz Display: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X