Home
News

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ లో రూ.1000 తగ్గింపు!! మరిన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా...

షియోమి స్మార్ట్‌ఫోన్ యొక్క సబ్-బ్రాండ్ పోకో సంస్థ ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నేడు అంటే మార్చి 7న భారతీయ మార్కెట్లో మొదటిసారి విక్రయానికి అందుబాటులోకి రానున్నది. మధ్యాహ్నం 12PM నుంచి ఫ్లిప్‌కార్ట్ లో మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ G96 SoC ద్వారా శక్తిని పొందుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మరియు 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ట్రిపుల్-కెమెరా సెటప్, 6GB వరకు RAM వంటి మరిన్ని మెరుగైన ఫీచర్లతో జతచేయబడి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.14,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,499, చివరిగా స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM + 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ యొక్క ధర రూ.17,999.

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ నేటి ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12PM నుంచి ప్రారంభమయే అమ్మకంలో HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్ రూ.1000 వరకు తగ్గింపును అందిస్తోంది. అంటే రూ.13,999 ప్రభావవంతమైన ధరతో మీరు దాన్ని పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ ఉంది. అదనంగా మీరు రూ.6999 తగ్గింపు ధర వద్ద గూగుల్ పిక్సల్ బడ్స్ A-సిరీస్‌ని కూడా పొందవచ్చు.

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.43-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను 1,080×2,400 పిక్సెల్‌లు, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,000 nits గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MIUI 13తో ఆండ్రాయిడ్11తో రన్ అవుతూ 8GB వరకు LPDDR4x RAMతో జత చేయబడి ఉండడమే కాకుండా ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G96 SoC ద్వారా శక్తిని పొందుతుంది.

పోకో M4 ప్రో

పోకో M4 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ కెమెరా ఫీచర్ల విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 118-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV)తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో సహా 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇది లిక్విడ్ కూల్ టెక్నాలజీ 1.0 మరియు డైనమిక్ ర్యామ్ విస్తరణను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 256GB UFS 2.2 స్టోరేజ్ తో అమర్చబడి ఉంది. దీనిని మైక్రో SD స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M4 Pro Smartphone First Sale Starts Today at 12PM via Flipkart: Price, Discount offers and Deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X