POCO కొత్త 5G ఫోన్ విడుదల.. 6.79 అంగుళాల డిస్‌ప్లే, 50MP AI కెమెరా సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. Poco M6 ప్రో 5G ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఇవాళ లాంచ్ అయింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoCపై పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సందర్భంగా పోకో ఇండియా ట్విట్టర్ (X) హ్యాండిల్‌లో ఓ పోస్టు చేసింది. ఈ కొత్త ఫోన్‌ను 5G డిస్ట్రప్టర్‌గా పేర్కొంది. M6 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో లభించనుంది.

పోకో M6 ప్రో 5G స్పెసిఫికేషన్లు : ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల పుల్ HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు స్క్రీన్ ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 లేయర్‌తో వస్తుంది.
పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రానుంది. రెండు OS అప్‌డేట్లు సహా మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని పోకో సంస్థ చెబుతోంది.

పోకో M6 ప్రో 5G ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 50MP AI సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP కెమెరా ఉంటుంది.
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. టైప్-C కేబుల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ IP53 రేటింగ్‌తో వస్తుంది. దీంతోపాటు సైడ్ మౌంటెండ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర : పోకో కొత్త 5G ఫోన్‌ను రెండు ర్యామ్, రెండు అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో తీసుకురానుంది. 4GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.10,999కు అందుబాటులో ఉండనుంది.
అదే 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.12,999కు కొనుగోలు చేయవచ్చు. పోకో M6 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 9 మధ్నాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








