నేటి నుంచి POCO M6 Pro కొత్త వేరియంట్ సేల్... ధర, ఫీచర్లు.. !
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో గత నెలలో POCO M6 Pro స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ కొత్త వేరియంట్ ఇవాళ్టి నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో ఉంది. ఈ ఫోన్ 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేయనుంది. మిడ్ రేంజ్ ధరకే పోకో సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90Hz రీప్రెష్ రేట్‌తో వచ్చింది. ఈ ఫోన్ 550 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్కాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoCతో అడెన్నో 613 GPU పై పనిచేయనుంది. 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది.

ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14పై పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ పోకో స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్, వైఫై6, బ్లూటూత్ 5.1, GPS సహా మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చింది.
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, సహా LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెంటర్ పంచ్ హోల్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.
ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000ల బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫలితంగా పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను 4GB వేరియంట్‌ను రూ.10,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ఫోన్ రూ.11,999గా ఉంది. అదే 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999 గా ఉంది. కొత్త వేరియంట్ ప్రస్తుతం సేల్‌లో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications