POCO కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
ప్రస్తుతం దేశంలో అధిక సంఖ్యలో 5G స్మార్ట్‌ఫోన్ విక్రయాలు జరుగుతున్నాయి. 4G ఫోన్ల కంటే కాస్త ధర ఎక్కువైనా 5G ఫోన్ల వైపే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల ఫోన్ల తయారీ సంస్థలు కూడా 5G ఫోన్ల తయారీపై అధికంగా దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో కొత్త ఫోన్ విడుదల చేయనుంది. పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ టీజర్ ఇమేజ్‌ను పోకో ఇండియా హెడ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అయితే ఫోన్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

ఈ కొత్త ఫోన్.. పోకో M4 ప్రో 5G ఫోన్‌కు కొనసాగింపుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పోకో M4 ప్రో 5G గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల అయింది. ఫోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 5న విడుదల కానుంది. లాంచ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.
పోకో M6 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్‌తో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14పై పనిచేస్తుంది. మరియు 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
పోకో ఇండియా హెడ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆధారంగా ఫోన్ వెనుక కర్వడ్ ప్యానల్స్‌ను కలిగి ఉంది. పోకో M4 ప్రో 5G తరహా రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్ మరియు డ్యూయల్ టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. పోకో M6 ప్రో 5G వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది.
పోకో M6 ప్రో స్మార్ట్‌ఫోన్ 2.2GHz అడెన్నో 613 GPU చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే అవకాశం ఉంది. మరియు 6GB ర్యామ్ వేరియంట్‌తో గ్రీక్‌బెంచ్‌లో నమోదు అయింది. 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లో లభించే అవకాశం ఉంది. మిగిలిన వేరియంట్ల వివరాలు తెలియాల్సి ఉంది.
పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరి కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. దాంతోపాటు ముందువైపు 5MP కెమెరాతో రానుంది. సిమ్ ట్రే ఫోన్ ఎడమ వైపున ఉంటుంది. పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ రూ.10 వేల నుంచి రూ.15వేల మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








