6 సంవత్సరాల అప్‌డేట్స్, స్నాప్‌డ్రాగన్ చిప్, 3D కర్వడ్ డిస్‌ప్లేతో 5G పోకో స్మార్ట్‌ఫోన్!
Poco M8 5G Smartphone : పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో జనవరి 8 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సమాచారం సహా అనేక వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పోకో తన X హ్యాండిల్‌లో షేర్ చేసిన వివరాల ఆధారంగా పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 తో లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని తెలిపింది.

3D కర్వడ్ డిస్‌ప్లే :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల (2392 x 1080 పిక్సల్స్) 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పోకో తెలిపింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే వెట్ టచ్ 2.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ ఫోన్ SGS MIL STD 810 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుందని, IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని పోకో తెలిపింది. 1.7 మీటర్ల డ్రాప్ టెస్ట్‌ను కూడా నిర్వహించింది. దీంతోపాటు ఈ ఫోన్ 7.35 mm థిక్‌నెస్, 178 గ్రాముల బరువుతో అందుబాటులోకి వస్తుందని పోకో తెలిపింది.
Slay Mode. Always On.
— POCO India (@IndiaPOCO) January 2, 2026
POCO M8 stays ahead with 4+6 update policy! pic.twitter.com/DI9LnoZJg2
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుందన సంస్థ తెలిపింది. ఈ చిప్ 8GB వర్చువల్ ర్యామ్‌తో మొత్తంగా 16GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ చిప్ 825k AnTuTU స్కోర్‌ను పొందినట్లు పోకో తెలిపింది.
పోకో స్మార్ట్‌ఫోన్ కెమెరా, బ్యాటరీ వివరాలు వెల్లడికాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత అంచనా వివరాల ఆధారంగా ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
* పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ :
పోకో సంస్థ భారత్ మార్కెట్‌లో డిసెంబర్ 2025 లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.11999 గా ఉంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 10W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








