Home
News

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పోకో ఫోన్‌ల మీద భారీ డిస్కౌంట్ ఆఫర్లు....

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇండియాలో తన వార్షిక సంవత్సరం సందర్భంగా "ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్" అమ్మకాన్ని ఈ నెల 16 నుంచి మొదలుపెట్టనున్నది. అక్టోబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 21 వరకు కొనసాగే ఈ అమ్మకంలో పోకో M2, పోకో M2 ప్రో, పోకో X2 ఫోన్‌ల మీద అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నది.

"ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్" అమ్మకంలో స్మార్ట్ ఫోన్‌ల మీద భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ఐదు రోజుల పాటు జరిగే "ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్" అమ్మకంలో పోకో M2 స్మార్ట్ ఫోన్ మీద రూ.500 ధర తగ్గింపును తీసుకురాగా, పోకో M2 ప్రో యొక్క ధర మీద రూ.1,000 తగ్గింపును తీసుకువచ్చింది. ఈ ధరల తగ్గింపులు కేవలం అమ్మకం సమయంలో మాత్రమే ప్రత్యక్షమవుతాయి ఆ తర్వాత ఫోన్‌లు వాటి సాధారణ ధరకు అందుబాటులో ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో పోకో ఫోన్‌ల మీద డిస్కౌంట్ ధరలు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో పోకో ఫోన్‌ల మీద డిస్కౌంట్ ధరలు

సాధారణంగా పోకో M2 యొక్క ధర రూ.10,999 కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో దీని యొక్క ధర 10,499రూపాయలు. అంటే ఫ్లిప్‌కార్ట్ అమ్మకం సమయంలో దీని మీద రూ.500 వరకు తగ్గింపు లభించింది. దీని యొక్క ధరల వివరాలు వరుసగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.10,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.12,499. 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ మీద కూడా రూ.500 ధర తగ్గింపు అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో రూ.1000 ధర తగ్గింపు పొందిన పోకో M2 ప్రో

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో రూ.1000 ధర తగ్గింపు పొందిన పోకో M2 ప్రో

సాధారణంగా రూ.13,999 ధర వద్ద లభించే పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో రూ.1,000 ధర తగ్గింపును అందుకొని వినియోగదారులకు రూ.12,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో ఈ ఫోన్ యొక్క ధరలు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.13,999 ఉండగా, 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.14,999 మరియు టాప్-ఎండ్ మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. పోకో M2 ప్రో యొక్క అన్ని మోడళ్ల మీద రూ.1,000 డిస్కౌంట్ ధర లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో పోకో X2 ఫోన్ మీద ధర తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో పోకో X2 ఫోన్ మీద ధర తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో పోకో M2 ప్రో మాదిరిగానే పోకో X2 ఫోన్ మీద కూడా రూ.1,000 ధర తగ్గింపును అందిస్తున్నట్లు పోకో సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. పోకో X2 ఫోన్ యొక్క ప్రస్తుత ధరలు వరుసగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.17,499 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.18,499. చివరిది 8GBర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ప్రస్తుత ధర రూ.21,499. ఈ ఫోన్ యొక్క అన్ని మోడళ్ల మీద అమ్మకం సమయంలో రూ.1000 తగ్గిన ధరలు జాబితా చేయబడే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో SBI కార్డులను కలిగి వినియోగదారులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుల మీద 10 శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. అంతే కాకుండా ఫోన్‌లను మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయడానికి వారికి నో-కాస్ట్ EMI ఎంపికను కూడా అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులకు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్స్ యొక్క యాక్సిస్ అందరికంటే ముందుగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Poco Smartphones Price Cut Upto Rs.1000 on Flipkart Big Billion Days 2020 Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X