Poco X2 రాకతో బడ్జెట్ ఫోన్లకు పెద్ద షాక్....
షియోమీ యొక్క సబ్-బ్రాండ్ పోకో సంస్థ షియోమీ నుండి విడిపోయిన తరువాత ఎప్పటి నుంచో ఉరిస్తూ అంచనాలను పెంచిన తన రెండవ స్మార్ట్‌ఫోన్ పోకోX2 ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసారు. గత నెల రోజులగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క వివిధ రకాల టీజర్ లను మార్కెట్ లో విడుదల చేస్తూ అంచనాలను అమాంతం పెంచింది. బడ్జెట్ ధరలలో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరల వివరాలు
పోకో X2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మూడు వేరియంట్లలో రిలీజైంది. ఇందులో బేస్ మోడల్ 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.15,999, 6GB ర్యామ్ + 128Gb స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, చివరిది హై రేంజ్ 8Gb ర్యామ్ + 256Gb స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ అట్లాంటిస్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ మరియు ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో రిలీజ్ అయింది.

సేల్స్ ఆఫర్స్
పోకో X2 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 11 మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్నాయి. మొదటి సేల్స్ లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్
భారీ అంచనాలతో మార్కెట్ లోకి వచ్చిన పోకో X2 స్మార్ట్‌ఫోన్ ముందు మరియు వెనుక వైపున కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. 208 గ్రాముల బరువు గల ఈ స్మార్ట్‌ఫోన్ 8.8 మీటర్ల మందంతో వస్తుంది. ఇది 20: 9 కారక నిష్పత్తితో 2400 x 1080 పిక్సెల్స్ మరియు HDR10 సపోర్ట్ గల 6.67-అంగుళాల ఫుల్ HD + రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తున్న రెండవ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

కెమెరాలు
పోకో X2 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక వైపున క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులోని మెయిన్ కెమెరా f / 1.9 ఎపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్‌ను కలిగి ఉండడమే కాకుండా పేస్ డిటెక్ట్ ఆటోఫోకస్ ను కలిగి ఉంటుంది. ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా మరియు డీప్ మరియు మాక్రో సెన్సార్లుగా పనిచేసే డ్యూయల్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఇందులో పిల్ ఆకారపు కటౌట్లో 20-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ సెన్సార్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

ఫీచర్స్
పోకో X2 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన అడ్రినో 618 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G మొబైల్ ప్లాట్‌ఫాంతో రన్ అవుతుంది. రియల్‌మి X2 కూడా ఇదే ప్రాసెసర్ ను ఉపయోగించడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా MIUI 11 తో రన్ అవ్వడమే కాకుండా ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది.

బ్యాటరీ
పోకో X2 స్మార్ట్‌ఫోన్ 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఇది వైఫై 802.11ac, బ్లూటూత్ 5.0, NFC, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. పోకో ఎక్స్ 2 ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ మరియు మ్యాట్రిక్స్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








