Home
News

Poco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశం

షియోమీ యొక్క సబ్-బ్రాండ్ గా వచ్చిన పోకో సంస్థ ఇండియాలో ఫిబ్రవరి మొదటి వారంలో తన పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పరిమిత కాలంలో మాత్రమే లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించబడుతోంది.

పోకో X2

పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క చివరి అమ్మకం మార్చి 3 న జరిగింది. గత అమ్మకంలో ఫియోనిక్స్ రెడ్ కలర్ వేరియంట్ అధికంగా అమ్ముడయినది. మార్చి 3న జరిగిన సేల్ ఈ స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ యొక్క అతిపెద్ద అమ్మకం అని పేర్కొంది. ఫిబ్రవరి 4 న ఫోన్ లాంచ్ అయిన తర్వాత పోకో X2 మొదటిసారి ఫిబ్రవరి 11 న అమ్మకానికి వచ్చింది.

 

 

దరల వివరాలు

దరల వివరాలు

పోకో X2 ఇండియాలో మూడు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో బేస్ వేరియంట్‌ 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ధర రూ.15,999 మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.16,999 కాగా చివరిది టాప్-ఎండ్ మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.19,999గా ఉంది.

 

 

పోకో X2 సేల్స్ ఆఫర్స్

పోకో X2 సేల్స్ ఆఫర్స్

పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయదలచిన ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుల కస్టమర్లు రూ.1,000 తగ్గింపును పొందుతారు. ఈ పోకో X2 యొక్క సేల్స్ మార్చి 10, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనడానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముందుమాదిరి సేల్స్ లా కాకుండా ఈ అమ్మకంలో ఇది ఫియోనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ మరియు మ్యాట్రిక్స్ పర్పుల్ వంటి మూడు కలర్ లలో అందుబాటులో ఉంటుంది.

 

 

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలలోకి వెళితే ఇది ముందు మరియు వెనుక వైపున కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. 208 గ్రాముల బరువు గల ఈ స్మార్ట్‌ఫోన్ 8.8 మీటర్ల మందంతో వస్తుంది. ఇది 20: 9 కారక నిష్పత్తితో 2400 x 1080 పిక్సెల్స్ మరియు HDR10 సపోర్ట్ గల 6.67-అంగుళాల ఫుల్ HD + రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తున్న రెండవ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం.

 

 

కెమెరాలు

కెమెరాలు

పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక వైపున క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులోని మెయిన్ కెమెరా f / 1.9 ఎపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్‌ను కలిగి ఉండడమే కాకుండా పేస్ డిటెక్ట్ ఆటోఫోకస్ ను కలిగి ఉంటుంది. ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా మరియు డీప్ మరియు మాక్రో సెన్సార్లుగా పనిచేసే డ్యూయల్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఇందులో పిల్ ఆకారపు కటౌట్లో 20-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ సెన్సార్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

 

 

ఫీచర్స్

ఫీచర్స్

పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన అడ్రినో 618 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G మొబైల్ ప్లాట్‌ఫాంతో రన్ అవుతుంది. రియల్‌మి X2 కూడా ఇదే ప్రాసెసర్ ను ఉపయోగించడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా MIUI 11 తో రన్ అవ్వడమే కాకుండా ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది.

 

 

బ్యాటరీ

బ్యాటరీ

పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఇది వైఫై 802.11ac, బ్లూటూత్ 5.0, NFC, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. పోకో ఎక్స్ 2 ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ మరియు మ్యాట్రిక్స్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X2 Sale Live on Flipkart: India Price, Discount Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X