Just In
- 3 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 4 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 18 hrs ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 22 hrs ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- Finance
మళ్లీ రూ.49,000కి పసిడి, బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
- News
షాక్: ఆయన గెలిస్తే ఉపఎన్నిక తప్పదు -కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మాధవ రావు మృతి -శ్రీవిల్లిపుత్తూరులో విషాదం
- Movies
అఖిల్ ఏజెంట్ సినిమాలో స్టార్ హీరో స్పెషల్ రోల్?
- Sports
IPL 2021: బిగ్ పిక్చర్: నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ ట్రాక్ రికార్డ్ ఇదే: కలిసి రాని చెన్నై పిచ్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Poco X3 Pro మొదటి సేల్ లో అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి...
ఇండియాలో గతవారంలో విడుదలైన పోకోX3 Pro ఫోన్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకున్నది. ఇప్పుడు హ్యాండ్‌సెట్ మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన ఈ ఫోన్ మొదటి అమ్మకాలలో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడమే ఉత్తమం. ఈ ఫోన్ మొదటి అమ్మకంలో లభించే ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకోX3 ప్రో ధరలు & సేల్స్ ఆఫర్స్
ఇండియాలో పోకోX3 ప్రో ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6 GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.18,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.20,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ ను స్టీల్ బ్లూ, గ్రాఫైట్ బ్లాక్, గోల్డెన్ బ్రోన్స్ వంటి కలర్ ఎంపికలలో నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క నేటి మొదటి అమ్మకంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుల ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.1000 వరకు తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే అదనంగా నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పోకోX3 ప్రో MIUI 12 స్పెసిఫికేషన్స్
Poco X3 Pro స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డాట్ డిస్ప్లే ని 1080 x 2400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 120HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ విభాగానికి వస్తే ఇది MIUI 12 మరియు ఆండ్రాయిడ్11 తో రన్ అవుతుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 855 యొక్క అప్ డేట్ వెర్షన్ అయిన ప్రాసెసింగ్‌ను ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 SoC ను కలిగి ఉంటుంది.

పోకోX3 ప్రో 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్
Poco X3 Pro స్మార్ట్ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు తో 5,160mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ IP53 రేటింగ్‌తో వస్తుంది కావున నీటి తుంపర్లను నిరోధించి ఫోన్ ను సురక్షితంగా ఉంచుతుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో F / 1.79 ఎపర్చరుతో 48MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్ తో 8MP సెకండరీ కెమెరా, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందుభాగంలో 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

పోకోX3 ప్రో హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ ఫీచర్స్
Poco X3 Pro స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలు విషయానికి వస్తే ఇది 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి వంటి మద్దతును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క ఇతర అంశాలలో 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్పీకర్లు వంటివి మరిన్ని ఉన్నాయి. ఈ ఫోన్ 165.3 x 76.8 x 9.4mm కొలతలతో 215 గ్రాముల బరువును కలిగి ఉంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999