Poco X4 Pro 5G ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది!! ధరలు, ఫీచర్స్ లీక్ అయ్యాయి

|

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన యొక్క బ్రాండ్ నుంచి కొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్ ను ముందుకు తీసుకొని రానున్నది. Poco X4 Pro 5G పేరుతో రాబోయే ఈ ఫోన్ మార్చి 28న భారతదేశంలో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. Poco India Twitter ద్వారా దేశంలో కొత్త Poco X-సిరీస్ స్మార్ట్‌ఫోన్ రాకను సంస్థ ధృవీకరించింది. Poco మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో స్మార్ట్‌ఫోన్ డిజైన్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్‌ను వెల్లడిస్తూ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. Poco X4 Pro 5G ఇండియా వేరియంట్ టీజర్ ప్రకారం ఇది 64-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2022లో Poco M4 Pro 4Gతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభించబడింది. Poco X4 Pro 5G యొక్క గ్లోబల్ వేరియంట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Poco X4 Pro 5G ఇండియా లాంచ్ డేట్

Poco X4 Pro 5G ఇండియా లాంచ్ డేట్

ఇండియాలో Poco X4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అధికారిక లాంచ్ డేట్ ను ప్రకటిస్తూ Poco India ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 28న మధ్యాహ్నం 12:00 గంటలకు IST లాంచ్ కానుంది. పేర్కొన్నట్లుగా Poco X4 Pro 5G 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని పోస్టర్ సూచిస్తుంది, ఇది ఇండియా యొక్క వేరియంట్ కొద్దిగా భిన్నంగా ఉందని సూచిస్తుంది. ఇంకా ఈ హ్యాండ్‌సెట్ యొక్క లాంచ్ కి సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌లో ఒక అంకితమైన మైక్రోసైట్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

Poco X4 Pro 5G లీక్స్
 

Poco X4 Pro 5G లీక్స్

Poco X4 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం MWCలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ EUR 299 (దాదాపు రూ. 25,300) ధర ట్యాగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. అలాగే టాప్-ఎండ్ 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ EUR 349 (దాదాపు రూ. 29,500) ధర వద్ద లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ మరియు పోకో ఎల్లో కలర్ ఆప్షన్‌లలో విడుదలయ్యాయి. Poco X4 Pro 5G అనేది జనవరి చివరిలో ప్రారంభించబడిన Redmi Note 11 Pro 5G యొక్క గ్లోబల్ వేరియంట్ రీబ్రాండెడ్ వెర్షన్.

Poco X4 Pro 5G స్పెసిఫికేషన్స్(ఊహించిన)

Poco X4 Pro 5G స్పెసిఫికేషన్స్(ఊహించిన)

Poco X4 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క భారతీయ వేరియంట్‌లో కెమెరా మినహా మిగిలిన అన్ని కూడా గ్లోబల్ వేరియంట్‌లోని స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై మరియు కంపెనీ MIUI 13 స్కిన్‌తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే 1200 నిట్స్ గరిష్ట ప్రకాశం, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ 8GB RAMతో జత చేయబడి ఉండి 11GB వరకు డైనమిక్ RAM విస్తరణను కూడా అందిస్తుంది.

గ్లోబల్ వెర్షన్

Poco X4 Pro 5G యొక్క గ్లోబల్ వెర్షన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌కు బదులుగా భారతీయ వేరియంట్‌లో 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ AI- బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. గ్లోబల్ వేరియంట్ యొక్క కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇది 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరణకు (1TB వరకు) మద్దతు ఇచ్చే 256GB వరకు అంతర్నిర్మిత నిల్వను అందిస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్, NFC మరియు IR బ్లాస్టర్ ఉన్నాయి. Poco X4 Pro 5G యొక్క గ్లోబల్ మోడల్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Poco X4 Pro 5G India Launch Date Teaser Released: Price, Specifications Details Reviled

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X