Poco X4 Pro 5G రివ్యూ- సరికొత్త అప్‌గ్రేడ్‌లలో ఎంతమేర ఉపయోగకరంగా ఉంది...

|

షియోమి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యొక్క సబ్ బ్రాండ్ గా మొబైల్ రంగంలోకి అడుగుపెట్టిన పోకో సంస్థ గత వారం ఇండియాలో పోకో X4 ప్రో ని మిడ్ రేంజ్ ధరలో అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో లాంచ్ చేసింది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే 5G కనెక్టివిటీ, 120Hz AMOLED డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌తో పెద్ద బ్యాటరీ మరియు స్టీరియో స్పీకర్స్ వంటి టాప్ మొబైల్ ఫీచర్‌ల సమ్మేళనంతో లభిస్తూ విస్తృత వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంతో ఇండియా మార్కెట్ లో సేల్స్ ప్రారంభమయ్యాయి. పోకో X4 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.18,999 ప్రారంభ ధర వద్ద మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్లోని ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

**అద్భుతమైన డిజైన్
**వైబ్రంట్ & ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్
** లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్
** విలువైన కెమెరా అవుట్‌పుట్
** మంచి సౌండింగ్ స్పీకర్లు

మైనస్ పాయింట్స్

** ఇప్పటికీ Android 11తోనే రన్ అవుతుంది
** పేలవమైన ఆప్టిమైజ్ సాఫ్ట్‌వేర్
** సరిలేని సెకండరీ కెమెరాలు
** 1080p60 మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లేకపోవడం

 

డిజైన్ లో కొత్తదనం ఏమిటి?

డిజైన్ లో కొత్తదనం ఏమిటి?

Poco కొత్త హ్యాండ్‌సెట్‌లో కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను చేసింది. ఇది పోకో X3 ప్రో కంటే సన్నగా మరియు (10g) తేలికైనదిగా ఉంది. దీని డిజైన్ లో బ్యాక్ సైడ్ ఫ్లాట్-గ్లాస్ మరియు ఫ్లాట్ ప్లాస్టిక్ అంచులతో పాటుగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కమ్ పవర్ బటన్‌తో కలిగి ఉంది. ఇది ఫోన్‌ను వెంటనే అన్‌లాక్ చేయడానికి అనుమతిస్తుంది. అలాగే AI అసిస్టెంట్‌ని ప్రారంభించడంలోను, కెమెరాను ప్రారంభించడంలో మరియు కొన్ని పనులను చేయడంలో మీకు సహాయపడుతుంది.

స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్

స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్

Poco X4 Pro హ్యాండ్‌సెట్‌లో హైబ్రిడ్ SIM కార్డ్ ట్రేను కలిగి ఉంటుంది. దీని యొక్క దిగువ భాగంలో టైప్ C ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ మరియు బాటమ్-ఫైరింగ్ స్పీకర్ యూనిట్‌లను కలిగి ఉంటుంది. 3.5 mm ఆడియో జాక్‌తో పాటు స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కోసం మైక్రోఫోన్ మరియు IR బ్లాస్టర్ ఉన్నాయి. ఇందులోని స్టీరియో స్పీకర్లు అద్భుతమైన సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి.

Poco X4 Pro డిస్ప్లే

Poco X4 Pro డిస్ప్లే

Poco X4 Pro ఫోన్ యొక్క డిస్ప్లే ముందుతరం వాటితో పోలిస్తే అప్‌గ్రేడ్ గా అందుబాటులోకి వచ్చింది. దీని యొక్క స్క్రీన్ ఫ్లూయిడ్ మరియు కలర్ విభాగాలలో మెరుగ్గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది AMOLED ప్యానెల్ కావున వీడియోలు మరింత లీనమయ్యేలా కనిపిస్తాయి. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ గేమ్‌లు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది 1200 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుండడంతో పగటి పూట అధిక కాంతిలో కూడా OLED ప్యానెల్ ద్వారా కంటెంట్ ను మెరుగ్గా చూడడానికి వీలు ఉంటుంది.

Poco X4 Pro సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌

Poco X4 Pro సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌

Poco X4 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క రోజువారీ పనితీరు స్పష్టంగా ఉంటుంది. అయితే చాలా యాప్‌లు చికాకు కలిగించే యానిమేషన్‌లతో లోడ్ అవుతాయి కావున పోకో డివైస్ నుండి మనం ఆశించినంత సున్నితంగా ఉండవు. కెమెరా యాప్ నెమ్మదిగా లోడ్ అవుతుంది. అలాగే మోడ్‌లను మార్చేటప్పుడు మరియు 64MP హై-రిజల్యూషన్ చిత్రాలను తీస్తున్నప్పుడు స్థిరంగా లాగ్ అవుతుంది. మేము MIUI 13.0.2తో 8GB + 128GB వేరియంట్‌ని పరీక్షిస్తున్నాము మరియు ఇది పోర్ట్‌ఫోలియోలో అత్యుత్తమ వేరియంట్. దీని కంటే తక్కువ RAM ఉన్న వేరియంట్లు నెమ్మదిగా అనిపించవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఈ సమస్యలను పరిష్కరించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్ మనం అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు.

కెమెరా పనితీరు

కెమెరా పనితీరు

** 64MP ప్రైమరీ సెన్సార్ మెరుగైన వివరణాత్మక ఫోటోలను సంగ్రహిస్తుంది. అవుట్‌డోర్ మరియు ఇండోర్ ఫోటోలు రెండూ కూడా ఆకట్టుకునే విధంగా తీయబడ్డాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను అధికంగా ఉపయోగించే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

** కలర్ మరియు డైనమిక్ రేంజ్ ఆకట్టుకుంటుంది కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ ఇప్పటికీ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

** Poco X4 ప్రో యొక్క కెమెరా అదనపు షార్ప్‌నెస్ సమస్య అలాగే ఉంది. ఇది చాలా బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ Xiaomi హ్యాండ్‌సెట్‌లను ప్రభావితం చేస్తుంది. మరింత సహజంగా కనిపించే ఫోటో అవుట్‌పుట్ కోసం AI మరియు ప్రో కలర్ మోడ్‌ను ఉపయోగించకపోవడమే మంచిది అని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

** 64MP హై-రిజల్యూషన్ మోడ్‌లో షూట్ చేయడం మరియు పోస్ట్-ప్రాసెసింగ్‌లో సవరణలు చేయడం ఉత్తమం.

 

1080p 30fps వీడియో రికార్డింగ్

1080p 30fps వీడియో రికార్డింగ్

** Poco X4 Pro ఫోన్ హై-డెఫినిషన్ వీడియోలను క్యాప్చర్ చేయడానికి అనువుగా ఉంది. కలర్ కూడా చక్కగా కనిపిస్తాయి కానీ ఫ్రేమ్ రేట్ కేవలం 30fpsకి పరిమితం చేయబడింది. ఇది నిరుత్సాహాన్ని కలిగించే విషయం.

** 2MP ఫిక్స్‌డ్ ఫోకస్ మాక్రో సెన్సార్ వీడియో కోసం సరికాదు. లైటింగ్ సమస్య లేకుంటే మీరు సబ్జెక్ట్ ను దూరం నుంచి కూడా జాగ్రత్తగా మంచి షాట్‌లతో క్యాప్చర్ చేయవచ్చు.

** మొత్తంమీద Poco X4 Pro ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు సరైన స్మార్ట్‌ఫోన్ కాదు. పిక్సెల్-పీపింగ్‌ను ఇష్టపడని మరియు ప్రాథమిక అవసరాల కోసం ఇష్టపడే వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

 

బ్యాటరీ లైఫ్ & ఫాస్ట్ ఛార్జింగ్

బ్యాటరీ లైఫ్ & ఫాస్ట్ ఛార్జింగ్

ఇతర Xiaomi ఫోన్‌ల మాదిరిగానే పోకో X4 ప్రో కూడా 5,000mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ మద్దతుతో వస్తుంది. ఇది 50 నిమిషాల కంటే తక్కువ సమయంలో 100% పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కి సంబంధించినంతవరకు ఇది అద్భుతమైన స్టాండ్‌బై మరియు రన్నింగ్ టైమ్‌ని అందిస్తుంది. అధికంగా వినియోగించినప్పటికీ కూడా స్మార్ట్‌ఫోన్ సులభంగా ఒకటిన్నర రోజుల వరకు లైఫ్ వస్తుంది. మీరు రోజంతా వీడియోలను స్ట్రీమ్ చేయకుండా మరియు గేమ్‌లను ఆడకుండా స్క్రీన్‌ను 60Hzలో రన్ అయ్యేలా సెట్ చేయగలిగితే కనుక ఒక్క ఫుల్ ఛార్జ్‌తో రెండు రోజుల వరకు ఫోన్ ఆన్ లో ఉంటుంది.

తీర్పు

తీర్పు

2022 లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఇతర హ్యాండ్‌సెట్‌ల మాదిరిగానే పోకో X4 ప్రో కొన్ని రాజీల వాటాను కలిగి ఉంది. పనితీరు విషయంలో ఇది పోకో హ్యాండ్‌సెట్‌లను పోటీ నుండి వేరు చేస్తుంది. కానీ ఈ బడ్జెట్‌లో ఎవరూ కూడా గేమ్-సెంట్రిక్ ఫీచర్లను కోరుకోరు కాబట్టి దీనికి భారతదేశంలో మార్కెట్ ఉండవచ్చు. ఫాస్ట్‌చార్జింగ్‌, బెస్ట్ డిజైన్ & డిస్‌ప్లేతో కూడిన 5G స్మార్ట్‌ఫోన్ కావున రోజువారీ అవసరాలకు ఈ విధమైన అమరికతో సంతోషంగా ఉంటే కనుక ఇది మిమ్మల్ని నిరాశపరచదు.

Best Mobiles in India

English summary
Poco X4 Pro 5G Review- Fine Upgrades Overshadow The Compromises

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X