కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మార్చి 14 వరకు వేచి ఉండండి! ఎందుకంటే..!
పోకో X5 5G స్మార్ట్ ఫోన్ మార్చి 14 న భారతీయ మార్కెట్లో లాంచ్ కాబోతోందని చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ గురువారం ధృవీకరించింది. ఈ పోకో ఫోన్ ట్విట్టర్ లో వీడియో టీజర్ ద్వారా, పరికరం యొక్క లాంచ్ తేదీ మరియు సమయాన్ని ధృవీకరించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కు రానుంది.
ఈ కొత్త పోకో X సిరీస్ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న రంగుల ఎంపికలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది మరియు ఈ ఫోన్ బడ్జెట్ ధర ట్యాగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ పోకో ఫోన్ ఫిబ్రవరి లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.67 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పరికరం యొక్క ఇతర ప్రధాన ముఖ్యాంశాలు.

ట్విట్టర్‌లో పోకో యొక్క అధికారిక ఇండియా ఖాతా ద్వారా పోకో X5 5G యొక్క రాబోయే లాంచ్ గురించి టీజర్ ను విడుదల చేసారు. ఈ లాంచ్ ఈవెంట్ మార్చి 14 మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది మరియు దీనిని అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ చేయబడుతుందని ధృవీకరించబడింది.
ఈ టీజర్ వీడియో మనకు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫస్ట్ లుక్ ను అందిస్తుంది. మరియు ఈ ఫోన్, కనీసం మూడు కలర్ వేరియంట్‌ల లో లాంచ్ అవుతుందని సూచిస్తుంది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క స్పెషల్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
పోకో X5 5G స్మార్ట్ ఫోన్ 8 GB RAM + 256GB స్టోరేజ్‌తో టాప్ ఎండ్ వేరియంట్ కోసం $289 (దాదాపు రూ. 24,700) ధర ట్యాగ్‌తో గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేయబడింది. ఇది నలుపు, నీలం మరియు ఆకుపచ్చ రంగులలో వస్తుంది. ఈ భారత వేరియంట్ ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.

పోకో X5 5G స్పెసిఫికేషన్ల వివరాలు
పోకో X5 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13 పై పనిచేస్తుంది. మరియు ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా,సెల్ఫీ షూటర్‌ను ఉంచడానికి డిస్ప్లే హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది, దీనితో పాటు గరిష్టంగా 8GB వరకు LPDDR4X ర్యామ్ ఉంటుంది.
ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, పోకో X5 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, 16 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది.
ఇంకా,ఇది 256GB వరకు UFS2.2 స్టోరేజీ ని కూడా కలిగి ఉంది. ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు ఇది మద్దతు ఇస్తుంది. పోకో X5 5G ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ తో వస్తుంది.


Click it and Unblock the Notifications








