Home
News

ఇండియా లో పోకో కొత్త 5g ఫోన్ లాంచ్ అయింది, ఈ రోజే ! ధర, ఆఫర్లు

By Maheswara

పోకో X5 సిరీస్ బేస్ మరియు ప్రో వేరియంట్‌తో ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడింది. పోకో X5 ప్రో మరియు పోకో X5 రెండూ ఆండ్రాయిడ్ 12తో వచ్చే 5G స్మార్ట్ ఫోన్లు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G SoC ప్రాసెసర్ పోకో X5 ప్రో ఫోన్ కి శక్తినిస్తుంది. అయితే, పోకో X5 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్ ప్రాసెసర్ తో వస్తుంది.

పోకో X5 ప్రో 5G మోడల్ గత నెలలో భారతదేశంలో లాంచ్ చేయబడింది. పోకో ద్వారా లాంచ్ అయిన మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల ఎంపికలతో రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో మన దేశంలో లాంచ్ చేయబడింది. ఇప్పుడు,ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారతదేశంలో బేస్ పోకో X5 5G మోడల్‌ను విడుదల చేసింది.

Poco X5 5G With 48MP Main Camera, 16MP Selfie Camera And 33W Fast Charging Launched In India.

బేస్ మోడల్ పోకో X5 5G మోడల్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 6GB ర్యామ్ తో 128GB స్టోరేజ్ మరియు 8GB ర్యామ్ తో 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది. భారతదేశంలో వీటి ధరలు వరసగా రూ.19,999 మరియు రూ.20,999 కి అందుబాటులో ఉంది. ఇంకా వీటిపై బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ప్రత్యేక మొదటి రోజు సేల్ ఆఫర్లు ఉన్నాయి అన్నింటిని కలిపి మొదటి వేరియంట్ ధర రూ.16,999 కి మరియు తర్వాతి వేరియంట్ ధర రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ సూపర్‌నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ మరియు జాగ్వార్ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో అందించబడుతుంది. పోకో X5 5G భారతదేశంలో మార్చి 21న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేయబడుతుంది. ఇంకా, ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ మరియు ఎల్లో కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్న పోకో X5 ప్రో 5G మోడల్ భారతదేశంలో బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 22,999 మరియు హై-ఎండ్ 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ కోసం రూ.24,999 ధర వద్ద లాంచ్ అయింది.

Poco X5 5G With 48MP Main Camera, 16MP Selfie Camera And 33W Fast Charging Launched In India.

డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉన్న పోకో X5 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా MIUI 13 ని తీసుకువస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్ ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది.

ఈ పోకో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. పోక X5 5G ఫోన్ లో ముందువైపు సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది డిస్‌ప్లే పైభాగంలో పంచ్ హోల్ కట్ ఔట్ లో ఉంటుంది.

ఇక కనెక్టివిటీ ఆప్షన్లను గమనిస్తే, బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS మరియు NFC కనెక్టివిటీ లు ఈ స్మార్ట్‌ఫోన్‌కు మద్దతు ఇస్తాయి. ఇది 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. పోకో X5 5G ఫోన్ బరువు 189 గ్రాములు మరియు పరిమాణం పొడవు,వెడల్పు ,మందం లో 165.88mm x 76.21mm x 7.98mm గా ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X5 5G With 48MP Main Camera, 16MP Selfie Camera And 33W Fast Charging Launched In India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X