Home
News

Poco X6 5G సిరీస్‌ ఫోన్ల సేల్‌ ప్రారంభం అయింది.. ఈ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2వేల తగ్గింపు..!

పోకో నుంచి జనవరి 11న X6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌ అయ్యాయి. ఈ సిరీస్‌లో పోకో X6, పోకో X6 ప్రో హ్యాండ్‌సెట్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు సేల్‌ (Poco X6 5G Series sale) ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ (జనవరి 16) న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయ్యింది.

పోకో X6 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.21,999గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24,999 గా ఉంది. అదే ప్రో మోడల్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.26999గా ఉంది.

Poco X6 5g series sale is live on flipkart

12GB ర్యామ్‌ +512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ కింద ICICI, HDFC బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

పోకో X6 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ క్కాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7S జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Poco X6 5g series sale is live on flipkart

ఈ ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లేకు గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణతో వస్తుంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ OIS సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో యూనిట్‌ తో వస్తుంది. అలాగే సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ MIUI 14 OSను కలిగి ఉంటుంది.

Poco X6 5g series sale is live on flipkart

పోకో X6 ప్రో 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా SOC చిప్‌ను కలిగి ఉంటాయి. 16GB LPDDR5X ర్యామ్‌, 1TB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడతాయి. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ హైపర్‌ OSను కలిగి ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు పోకో సంస్థ తెలిపింది.

ఈ ప్రో మోడల్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 64MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.

ఈ ప్రో మోడల్‌ 6.67 అంగుళాల 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. డాల్బీ విజన్, HRD10+ ను సపోర్టు చేస్తుంది. గొరెల్లా విక్టస్‌ స్క్రీన్‌ భద్రతను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సపోర్టుతో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X6 5g series sale is live on flipkart here are the features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X