Home
News

12GB RAM, 108MP కెమెరా ఫోన్ ఇప్పుడు రూ.14999 కే ! సేల్ ఆఫర్ వివరాలు

ఫ్లిప్కార్ట్ సేల్ లో POCO X6 Neo 5G ఫోన్ పై ఇప్పుడు భారీ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ లో 108MP కెమెరా, 12GB RAM, అమోలెడ్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ వంటి ఫీచర్లతో పాటు అల్ట్రా ప్రీమియం లుక్‌తో వచ్చే పోకో X6 నియో 5G ఫోన్ నమ్మశక్యం కాని 27శాతం తగ్గింపు ఆఫర్ తో లభిస్తుంది. ఇది 12GB డైనమిక్ ర్యామ్, డాల్బీ అట్మాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఇతర ఫీచర్లు కూడా బడ్జెట్‌కు జోడించబడ్డాయి. ఇప్పుడు మీరు ఈ పోకో X6 నియో 5G ఫోన్ యొక్క పూర్తి ఫీచర్లు, ధర మరియు సేల్ వివరాలను తెలుసుకోవచ్చు.

Poco X6 Neo 5G ధర వివరాలు
ఈ పోకో X6 నియో 5G ఫోన్ యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999 గా నిర్ణయించారు. కానీ ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.15,999 బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్‌లో రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి, మీరు దీన్ని రూ.14,999 బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Poco X6 Neo 5G Is Now Available with discount

ఈ ఫోన్ 8 GB RAM + 128 GB స్టోరేజీ వేరియంట్‌ని కలిగి ఉంది. ఇది, రూ.14,999 కి అందుబాటులో ఉంది.రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అంటే రూ.13,999 కే కొనుగోలు చేయవచ్చు.

POCO X6 నియో 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు : ఈ నియో మోడల్ 6.67-అంగుళాల (1080×2400 పిక్సెల్‌లు) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది.ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. అలాగే, ఈ పోకో 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ బడ్జెట్‌లో కూడా మిడ్-ప్రీమియం డిస్‌ప్లే అవుట్‌పుట్‌ను ఆశించండి. ఆండ్రాయిడ్ 13 OS ఆధారిత MIUI 14 కి మద్దతు ఇస్తుంది.

పోకో X6 నియో 5G ఫోన్, ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 6nm చిప్‌సెట్ మరియు Mali G57 MC2 GPU గ్రాఫిక్స్ కార్డ్ సపోర్ట్‌ని కలిగి ఉంది. ఈ బడ్జెట్ మోడల్ డీసెంట్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ని కలిగి ఉంది.

కెమెరా వివరాలు గమనిస్తే, ఇది 108MP ప్రో గ్రేడ్ మెయిన్ కెమెరా + 2MP డెప్త్ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, వాయిస్ షట్టర్, ఫిల్మ్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. 3x ఇన్-సెన్సార్ జూమింగ్‌తో వస్తుంది. ఇది ఫిల్మ్ ఫిల్టర్‌లు, పోర్ట్రెయిట్, పామ్ షట్టర్ మొదలైన ఫీచర్లతో 16MP సెల్ఫీ షూటర్‌తో కూడా వస్తుంది. కాబట్టి, బడ్జెట్ కెమెరా ప్రియులకు ఈ పోకో ఫోన్ నచ్చుతుంది.

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. అలాగే, 8GB మోడల్ 8GB డైనమిక్ RAM మరియు 12GB మోడల్ 12GB డైనమిక్ RAMతో వస్తుంది. ఇప్పటివరకు ఇది 1 TBకి స్టోరేజ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

ఇది ఇన్‌ఫ్రారెడ్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్ల తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. పోకో X6 నియో 5G ఫోన్ 5000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ మరియు మార్టిన్ ఆరెంజ్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Poco X6 Neo 5G Is Now Available With Huge Discount Of 27 Percent In Flipkart Sale. Offer Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X