Home
News

Poco నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 64MP కెమెరా సహా..!!

పోకో కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ Poco X6 సిరీస్‌ త్వరలో లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. పోకో X5 మరియు పోకో X5 ప్రో హ్యాండ్‌సెట్‌ తర్వాత తరం ఫోన్‌గా పోకో X6 సిరీస్‌ విడుదల అవుతుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఇప్పటికే అనేక లీక్‌లు వచ్చాయి. తాజాగా త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా భారత్‌లో విడుదల కానున్నాయి.

పోకో X6 సిరీస్‌లో భాగంగా పోకో X6 మరియు పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ బ్యానర్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ జనవరి 11న భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ K70E హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వస్తుందని తెలుస్తుంది. అదే పోకో X6.. రెడ్‌మీ నోట్‌ 13 ప్రోకు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా తెలుస్తోంది.

poco-x6-series-

పోకో X6 సిరీస్‌ ద్వారా ఈ బ్రాండ్‌ తొలిసారిగా మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రాపవర్‌ స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ 1.5 LTPS డిస్‌ప్లేతో రానుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) ఫీచర్‌తో వస్తుంది. 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు LED ప్లాష్‌తో వస్తుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

పోకో X6 ప్రో మోడల్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు పోకో X6 క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే బ్లాక్‌, గ్రే, పసుపు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయని తెలుస్తుంది. అదే ప్రో మోడల్‌ బ్లాక్‌, బ్లూ, తెలుపు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.

ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌ ఫోన్లు 8GB ర్యామ్, 12GB ర్యామ్‌ వేరియంట్లలో అందుబాటులోకి ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు 256 GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఈ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లపై పోకో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జనవరి 11న ఈ సిరీస్‌ భారత్‌లో విడుదల కానుంది. ఈ పోకో X6 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపైనా సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X6 series smartphones to launched on January 11 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X