గుగూల్ నేటి స్పెషల్.. ‘పోల్ వాల్ట్’

Posted By: Prashanth

గుగూల్ నేటి స్పెషల్.. ‘పోల్ వాల్ట్’

 

2012 లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా శనివారం సెర్చ్ ఇంజన్ గూగుల్ ‘పోల్ వాల్ట్’ క్రీడకు ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత డూడుల్‌ను హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. ఒలంపిక్స్‌లో భాగంగా 1896 నుంచి పరిచయమైన పోల్ వాల్ట్ క్రీడ మొదట్లో పురుషులకే పరిమతమయ్యేది.2000 సంవత్సరం నుంచి మహిళల కూడా ఈ క్రీడలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఓ మహిళా పోల్ వాల్టర్ అతి పొడవైన ఫ్లెక్సిబుల్ పోల్ సాయంతో బార్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ఈ డూడుల్‌ ద్వారా మనం చూడొచ్చు.

లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot