జియో డేటా లీక్ చేసింది ఇతనే..

Written By:

టెలికం రంగంలో దూసుకుపోతున్న జియోకు డేటా లీక్ తో పెద్ద షాక్ తగిలిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జియో అలాంటిది ఏమీలేదని బుకాయించినా డేటా లీకయిందో లేదో విచారణ జరుపుతామని చెప్పడంపై అనేక అనుమానాలు రేగాయి. అయితే ఇప్పుడు తాజాగా లీక్ చేసిన వ్యక్తి ఇతనే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్నఫోన్లు ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మేజర్‌ లీక్‌లో

రిలయన్స్‌ జియో డేటా భారీ ఎత్తున్న లీకైనట్టు రిపోర్టులు వెలువడిన నేపద్యంలో ఈ మేజర్‌ లీక్‌లో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని రాజస్తాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

12 కోట్ల మంది కస్టమర్ల డేటా

12 కోట్ల మంది కస్టమర్ల డేటా మాజిక్‌ఏపీకే.కాంలో లీకైనట్టు వస్తున్న రిపోర్టులపై విచారణ జరుపుతామని, నిజంగా డేటా లీకైందో లేదో తేల్చుతామని ముఖేష్‌ అంబానీకి చెందిన జియో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం ప్రకటించాయి. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో కలిసి ఈ విచారణ చేపడతామని కంపెనీచెప్పింది.

ఇమ్రాన్‌ ఛింపా అనే వ్యక్తిని

ఈ విచారణలో భాగంగానే నేడు పోలీసులు ఇమ్రాన్‌ ఛింపా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడి ఓ స్థానిక పోలీసు అధికారి చెప్పారు. ముంబై నుంచి విచారణ టీమ్‌ రాజస్తాన్‌ వస్తున్నట్టు కూడా తెలిపారు.

ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్‌కు ఇతను ప్రొపైటర్‌

ఛింపా రాజస్తాన్‌లో సుజంఘడ్‌ పట్టణానికి చెందిన స్థానిక ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్‌కు ఇతను ప్రొపైటర్‌.

భారీ మొత్తంలో డేటా లీకవడం ఇవే తొలిసారి

ఓ టెలికాం సంస్థకు చెందిన భారీ మొత్తంలో డేటా లీకవడం ఇవే తొలిసారి అని సైబర్‌ సెక్యురిటీ అనాలిస్టులు చెబుతున్నారు.

మాజిక్‌ఏపీకే.కాం

ఈ లీకేజీలో జియో కస్టమర్లకు చెందిన ఫోన్‌ నెంబర్‌, చిరునామా, ఈ-మెయిల్‌ ఐడీ వంటి వివరాలతో పాటు ఆధార్‌ నెంబర్లు కూడా మాజిక్‌ఏపీకే.కాంలో దర్శనమిస్తున్నట్టు తెలిసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Police detain a suspect in Reliance Jio data leak probe Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting