హైదరాబాద్‌లో ఐటీ పెట్టుబడులు పెట్టండి: ఐటీ మంత్రి

Posted By: Super

హైదరాబాద్‌లో ఐటీ పెట్టుబడులు పెట్టండి: ఐటీ మంత్రి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ముఖ్యంగా ఐటీ రంగంలో తనదైన ప్రతిభాపటవాలను కనబరుస్తున్నదని మం త్రి పొన్నాల పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భా గంగా ఆయన అక్లోమా స్టేట్‌ యూనివర్సీటీ పుర్వ విద్యార్థుల సమావేశంలో భారత్‌ నుంచి ప్రత్యేక విశి ష్ట అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఇదే యూనివర్సీటీ నుంచి మంత్రి పొన్నాల మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఎమ్‌ఎస్‌ చేయడం విశేషం. ఈ సందర్బంగా ఆయన యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంతో పాటు అమెరికాలో స్థిరపడిన భారతీయ ఐటీ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ అడ్వాన్‌ టేజ్‌ ఏపీ-2011ను నిర్వహించామని, ఈ సమ్మెట్‌ లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని పొన్నాల తెలిపారు. 2010-15 ఐటీ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభత్వం అందచేస్తున్న ప్ర త్యేక రాయితీలు, ఇతర సదుపాయాలపైనా ఆయన వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అక్లోమా స్టేట్‌ యూనివర్సీటీ విశిష్ట పుర ష్కార గ్రహితగా ఆయన ను పేర్కొంటూ..ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. అ క్లోమా స్టేట్‌ యూనివర్సీటీ పూర్వ విద్యార్థులు కూడా మంత్రి పొన్నాలను ఘనం గా సత్కరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot