ఐఐటీలలో నైపుణ్యం లేని విద్యార్థులు: మూర్తి

Posted By: Staff

ఐఐటీలలో నైపుణ్యం లేని విద్యార్థులు: మూర్తి

న్యూయార్క్: ఇండియాలో ఉత్తమ విద్యకు నిలయాలు ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ). దేశం మొత్తం మీద నాణ్యమైన విద్యను అందింజే సంస్దలుగా ప్రతి ఒక్క ఇండియన్ భావిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల నుండి నిపుణులైన విద్యార్దులు బయటకు రావడం లేదనేది కొందరి వాదన. అంటే దీని ఉద్దేశ్యం ఐఐటీలలో చదివే విద్యార్దులలో తెలివితేటలు అంతగా ఉండడం లేదా అని ప్రశ్న మీమదిలో రావచ్చు. దీనికి అవుననే అంటున్నారు ఇన్పోసిస్ మాజీ ఛైర్మన్ ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి. ప్రతిష్ఠాత్మకమైన ఈ కాలేజీల్లో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి ప్రక్షాళ నం చేయాలని న్యూయార్క్‌లో జరిగిన పూర్వ ఐఐటీయన్స్‌, పాన్‌ ఐఐటీయన్‌ల సమావేశంలో అన్నారు.

ఇది మాత్రమే కాకుండా రోజు రోజుకు ఈ ప్రతిష్ఠాత్మకమైన కాలేజీలు చేరే విద్యార్థుల ప్రమాణాలు తగ్గుముఖం పట్టాయని, వీరికి శిక్షణ ఇచ్చి ఐఐటీ ప్రవేశ పరీక్షకు తయారు చేసే ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లు వారికి సరైన శిక్షన ఇవ్వడం లేదని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా, సుమారు 400 మందితో నిండిన సదస్సు ప్రాంగణం చప్పట్లతో మార్మ్రోగింది.. భారత్‌లోని ఐఐటిల నుంచి బయటకు వచ్చి గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్నత విద్యావకాశాలను దక్కించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఆయన అన్నారు.

ఐఐటీ ఉత్తీర్ణులై ఉద్యోగాల్లో చేరిన వారు గ్లోబల్‌ ఇన్సిస్టిట్యూట్‌ లలో తమ సత్తాను చాటలేక చతికిలపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై సీటు సంపాదించిన వారిలో 20 శాతం మంది మాత్రమే ప్రపంచంలోని అత్యుత్తుమ ఇంజినీర్లుగా కొనసాగుతున్నారని ఆయన అన్నారు. మిగతా 80 శాతం మంది విద్యార్థులు అనుకున్నంత రాణించలేకపోతు న్నారు. ఐఐటీలో ఎలాగో అలాగే సీటు సంపాదించిన తర్వాత అమెరికా లాంటి దేశాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారి అసలు రంగ బయటపడు తుందని మూర్తి అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting