వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో కాల్స్ కారణంగా డామేజీ అవుతున్న పాప్-అప్ సెల్ఫీ కెమెరాలు
పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో గల స్మార్ట్‌ఫోన్‌ను మీరు కలిగి ఉన్నారా లేకపోతే కొనడానికి ప్రయత్నిస్తున్నార అయితే కాస్త అలోచించి కొనుగోలు చేయండి. పాప్-అప్ సెల్ఫీ కెమెరా గల స్మార్ట్‌ఫోన్‌లలో ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఉన్న అన్ని పాప్-అప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు రియల్ మిX, షియోమి రెడ్‌మి K20, రెడ్‌మి K20 ప్రో, ఒప్పో రెనో 10X జూమ్, ఆసుస్ 6Z మరియు వన్‌ప్లస్ 7 ప్రో కూడా ఈ సమస్యను కలిగి ఉన్నాయి.

వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ యొక్క వీడియో కాలింగ్ సమయాలలో పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఆటోమేటిక్ గా పైకి రావడంతో భౌతికంగా నష్టం జరుగుతోంది. 2019 సంవత్సరంలో పాప్-అప్ సెల్ఫీ కెమెరాలు సర్వసాదారణం అయిపోయినయి. సుమారు ఒక సంవత్సరం క్రితం మనం చాలా వరకు చూడాలని అనుకోన్న ఈ ఫీచర్ ఇప్పుడు ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు దారితీసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర కూడా 20,000 రూపాయల కన్నా తక్కువగా ఉంది.
వీడియో కాలింగ్ లో UI కోడ్:

మీరు పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీరు తెలుసుకోవలసిన విషయం ఉంది. వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ యొక్క వీడియో కాల్ UI కారణంగా ఈ సమస్య ఏర్పడింది. వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ యొక్క వీడియో కాలింగ్ లో UI ఉన్న ఒక కోడ్ ఉంది. ఇది వినియోగదారు కాల్ స్వీకరించడానికి ముందే పాప్-అప్ సెల్ఫీ కెమెరాను ప్రేరేపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే మీకు వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వీడియో కాల్ వచ్చినప్పుడు ఈ యాప్ లోని UI కోడ్ కాల్ ను రిసీవ్ చేయడానికి ముందుగానే కెమెరాను బలవంతంగా యాక్సిస్ చేస్తుంది. దీని కారణంగా మీరు కాల్ స్వీకరించడానికి స్మార్ట్ఫోన్‌ను మీ జేబులో లేదా బ్యాగ్ నుండి బయటకు తీసేముందు పాప్-అప్ సెల్ఫీ కెమెరా డ్యమేజ్ అయే ప్రమాదం ఉంది .
స్మార్ట్‌ఫోన్:

రియల్ మిX, షియోమి రెడ్‌మి K20, రెడ్‌మి K20 ప్రో, ఒప్పో రెనో 10X జూమ్, ఆసుస్ 6Z మరియు వన్‌ప్లస్ 7 ప్రో అన్ని ఫోన్‌లు పాప్-అప్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లలో ప్రతిసారీ వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వీడియో కాల్ చేసినప్పుడు ప్రతి సారి ఇవి అన్ని స్వయంచాలకంగా పాప్-అప్ సెల్ఫీ కెమెరాను యాక్సిస్ చేసాయి. డ్యమేజ్ విషయం కోసం TOI ని సంప్రదించినప్పుడు షియోమి, వన్‌ప్లస్, ఒప్పో మరియు ఆసుస్‌లోని సేవా కేంద్రాల అధికారులు పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌కు భౌతిక నష్టంపై ఎటువంటి వారెంటీ లేదని ధృవీకరించారు.


Click it and Unblock the Notifications








