'క్రిస్‌మస్ ట్రీ' కోసం ఆండ్రాయిడ్‌ని ఎంచుకున్న 'పోప్'

Posted By:

'క్రిస్‌మస్ ట్రీ' కోసం ఆండ్రాయిడ్‌ని ఎంచుకున్న 'పోప్'

 

క్రిస్టియన్ల మత గురువు పోప్ ఈ సంవత్సరం 'క్రిస్‌మస్ ట్రీ లైట్‌'ని ఆవిష్కరించేందుకు గాను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే సోనీ టాబ్లెట్ ఎస్‌ని ఎంచుకోవడం జిరిగింది. గతంలో పోప్ బెనడిక్ట్ XVI 'ఆపిల్ ఐప్యాడ్ 2' ఉపయోగిస్తానని మాట ఇచ్చినప్పటికీ, ప్రపంచంలో అతి పెద్ద క్రిస్ మస్ ట్రీ లైట్ కోసం తప్పక పోప్ 'సోనీ టాబ్లెట్ ఎస్'ని వాడుతుండడం జరుగుతుంది. ఇలా సడన్‌గా ఈ మార్పుకి కారణాలు ఎవరికీ తెలియక పోయినప్పటికీ, ఈ సంవత్సరం క్రిస్ మస్ ట్రీ లైట్ ఛాన్స్‌ని మాత్రం సోనీ కొట్టేసిందని కంపెనీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రపంచంలో కెల్లా అతి పొడవైన ఈ క్రిస్ మస్ ట్రీ ఇటాలియన్ టౌన్ 'గుబ్బియో'లో క్రిస్ మస్ సందర్బంగా పోప్ ఆవిష్కరించనున్నారు. మౌంట్ ఇంగినో పర్వతంపై  పెరిగిన చిన్న చిన్న క్రిస్ మస్ ట్రీలను మొత్తంగా కలిపి అతి పెద్ద  క్రిస్ మస్ ట్రీగా క్రిస్ మస్ పండుగకు ఆవిష్కరించనున్నారు. ఈ క్రిస్ మస్ ట్రీ లైటింగ్ కొన్ని వందల మైల్స్ వరకు అలానే కాంతినిస్తుంది. ఈ క్రిస్ మస్ ట్రీ అరేంజ్‌మెంట్ అంతా కలర్ పుల్ లైటింగ్‌తో పండుగ వాతావరణంలాగా అలరించనుంది. ఈ క్రిస్ మస్ ట్రీ పొడవు 2,132 అడుగులు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే సోనీ టాబ్లెట్ ఎస్‌లో ఉన్న వర్చువల్ బటన్‌ని 130 మైల్స్ దూరంలో నుంచొని పోప్ ఆపరేట్ చేయనున్నారు. గతంలో పోప్ వాటికన్ వెబ్‌సైట్‌ని ఐప్యాడ్‌తో విడుదల చేసినప్పటికీ, ఈసారి మాత్రం క్రిస్ మస్ ట్రీని ఆవిష్కరించడానికి సోనీ టాబ్లెట్ ఎస్‌ని ఉపయోగించనున్నారు. సో ఈ కార్యక్రమం ద్వారా సోనీ టాబ్లెట్‌ని ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot