Home
News

రెడ్‌మీ కొత్త ఫోన్‌ నోట్‌ 12T Pro విడుదల.. డిజైన్‌, ఫీచర్ల వివరాలు

రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ Note 12T Pro విడుదల అయింది. ఈ ఫోన్‌ మెరుగైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. మరియు సరసమైన ధరలో, మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్‌ 12T ప్రో స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు మీకోసం.

రెడ్‌మీ నోట్‌ 12T ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.51 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ FHD+ డిస్‌ప్లే మరియు 144Hz రీఫ్రెస్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. 2460*1080 పిక్సల్‌ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 20:5:9 ఆస్పెక్ట్‌ రేషియో, 1400:1 కాంట్రస్టు రేషియోతో వస్తుంది. 270Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే డాల్బీ విజన్‌ మరియు HDR10 సౌకర్యంతో వస్తుంది. అలాగే 650 nits బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

Redmi Note 12T pro

రెడ్‌మీ నోట్‌ 12T ప్రో స్మార్ట్‌ఫోన్‌ మూడు కెమెరాలతో వస్తుంది. 64MP ప్రైమరి కెమెరా, 120 డిగ్రీ FOVతో 8Mp ఆల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రోలెన్స్‌ను కలిగి ఉంటుంది. పుల్‌ హెచ్‌డీ నాణ్యతతో వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు. ఫోన్ ముందువైపు 16MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాతోనూ 60fps వరకు పుల్‌ హెడ్‌డీ వీడియోను రికార్డు చేయవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 మరియు MIUI 14 ఆధారంగా పనిచేస్తుంది. WiFi 8021.11ac, బ్లూటూత్‌ 5.3 సపోర్ట్‌తో వస్తుంది. మరియు రెడ్‌మీ నోట్‌ 12T ప్రో స్మార్ట్‌ఫోన్‌ కార్బన్‌ బ్లాక్‌, ఐస్‌ ఫాగ్‌ వైట్‌, హరుమి బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

రెడ్‌మీ నోట్‌ 12T ప్రో ఫోన్ డిమెన్సిటీ 8200 ప్రోసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ గరిష్ఠంగా 12 GB ర్యామ్‌, 512 GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. మరియు 5080 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది.

రెడ్‌మీ నోట్‌ 12T ప్రో ప్రస్తుతం చైనాలో విడుదల అయింది. అయితే ఈ ఫోన్‌ భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై రెడ్‌మీ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చైనా ధరల ప్రకారం 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ ఫోన్‌ ధర 1599 యువాన్‌ (భారత కరెన్సీ ప్రకారం రూ.18,650), 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ఫోన్‌ ధర 1699 (19,891), 12GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ ఫోన్‌ ధర 1799 (రూ.20,987), 12GB ర్యామ్‌, 512GB అంతర్గత స్టోరేజీ ఫోన్‌ ధర 1999 (రూ.23,321) గా ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 12T ప్రో ఫోన్‌ నేటి (మే 31) నుంచి చైనాలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
popular smartphone brand Redmi launched Note 12T pro
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X