Home
News

రూ.10 వేల ధరలో స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ విడుదల.. సేల్ ‌ప్రారంభం..!

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్ సంస్థ పోర్ట్రోనిక్స్‌ భారత మార్కెట్లో ఇప్పటికే అనేక ప్రొజెక్టర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తక్కువ ధరలోనే అనేక మోడల్స్‌ ఉన్నాయి. అయితే తాజాగా భారత్‌ లో మరో ప్రొజెక్టర్‌ ను తీసుకొచ్చింది. పెద్ద స్క్రీన్‌లలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకొనే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాడ్జెట్‌ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

పోర్ట్రోనిక్స్‌ బీమ్ 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ ను (Portronics Beem 550 Smart LED Projector) లాంచ్‌ చేసింది. కంపాక్ట్‌ మోడల్‌ గా తీసుకొచ్చింది. ఎక్కువ లైటింగ్‌ ఉన్న గదుల్లోనూ స్పష్టమైన విజువల్‌ అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. రూ.10 వేల ధరలో ఈ ప్రొజెక్టర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Portronics Beem 550 Smart LED Projector launched in india

6000 లూమెన్స్‌ బ్రైట్‌నెస్‌ :
పోర్ట్రోనిక్స్‌ బీమ్ 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ 1080p HD రిజల్యూషన్‌, 6000 లూమెన్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ప్రొజెక్టర్‌ ఆటో ఫోకస్ మరియు ఆటో కీటోన్ కరెక్షన్‌ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా మాన్యువల్‌ గా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండదు.

100 అంగుళాల స్క్రీన్ వరకు :
పోర్ట్రోనిక్స్‌ బీమ్ 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ గరిష్ఠంగా 100 అంగుళాల స్క్రీన్ వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌, గేమింగ్‌ సహా ఆఫీస్‌ ప్రజెంటేషన్‌ సమయాల్లో అనుకూలంగా ఉంటుందని పోర్ట్రోనిక్స్‌ చెబుతోంది. ఈ ప్రొజెక్టర్‌ 40,000 గంటల వరకు ల్యాంప్‌ లైఫ్‌, 2000 : 1 కాంట్రాస్ట్‌ రేషియోను అందిస్తుంది.

మోనోపాడ్‌ స్టాండ్‌ :
ఈ ప్రొజెక్టర్‌ బిల్ట్‌ఇన్‌ టెలిస్కోపిక్‌ మోనోపాడ్‌ స్టాండ్‌ ను కలిగి ఉంది. ఈ స్టాండ్ ద్వారా ప్రొజెక్టర్‌ ఎత్తు మరియు యాంగిల్‌ ను సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్‌ 5W స్పీకర్‌ ను కలిగి ఉంది. ఫలితంగా ఆడియో పరంగానూ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ఇన్‌బిల్ట్‌ యాప్స్ :
ఈ పోర్ట్రోనిక్స్‌ LED ప్రొజెక్టర్‌ యూట్యూబ్‌, జియో హాట్‌స్టార్‌, ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ సహా అనేక యాప్స్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్‌ చేయబడి ఉంటాయి. అదనపు డివైజ్‌ ల అవసరం లేకుండా ఈ యాప్‌లను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

సులభంగా కనెక్ట్‌! :
బీమ్ 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ బ్లూటూత్‌ 5.0, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, USB, HDMI, AUX పోర్టులను కలిగి ఉంది.ఈ ప్రొజెక్టర్‌ ను స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, గేమింగ్‌ కన్సోల్‌ తో సులభంగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. కొత్త స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ ఇంట్లో, ట్రావెల్ లోనూ ఉపయోగించుకోవచ్చని పోర్ట్రోనిక్స్‌ చెబుతోంది.

పోర్ట్రోనిక్స్‌ బీమ్ 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ ధర, సేల్‌ వివరాలు :
పోర్ట్రోనిక్స్‌ బీమ్ 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ ప్రారంభ ధర రూ.9999 గా ఉంది. ఈ ప్రొజెక్టర్‌ ప్రస్తుతం పోర్ట్రోనిక్స్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Portronics Beem 550 Smart LED Projector launched in india under Rs10000 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X