ప్రభాస్ కల్కి 2898 AD ఓ విజువల్ వండర్.. సినిమా VFX గురించి ఈ విషయాలు తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హీందీలో ఈ సినిమా రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని శోభన వంటి అగ్రస్థాయి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ నిర్మించింది. తొలుత ప్రాజెక్ట్-K పేరుతో ప్రారంభం అయింది. ఈ అయితే సినిమాలో VFX కోసం భారీగా ఖర్చు చేశారు. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాను 2020 లో ప్రారంభం కాగా.. కరోనా సహా అనేక కారణాలతో షూటింగ్ ఆలస్యం అయింది. సుమారు నాలుగు సంవత్సరాల పాటు షూటింగ్ చేశారు. ఈ సినిమా 2D, 3D, IMAX, 4DX లో ఈ కల్కి 2898 AD ను విడుదల చేశారు. అయితే విదేశాల్లో 4DX లో విడుదల అయిన తొలి తెలుసు సినిమాగా గుర్తింపు పొందింది.

కల్కి 2898 AD సినిమా VFX కోసం DNEG, ప్రైమ్ ఫోకస్, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి సంస్థలు (Kalki 2898 AD Movie VFX Works) పనిచేశాయి. దీంతోపాటు ఈ సినిమాలో కొన్ని ప్రాంతాలను పూర్తిగా VFX లోనే చూపించారు. ఇందుకోసం సుమారు 700 VFX షాట్స్‌ను ఉపయోగించారు.
కల్కి సినిమా ఏయో టీమ్స్ పనిచేశాయి? :
దీంతోపాటు మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన కొన్ని బృందాలు కల్కి 2898 AD సినిమా కోసం పనిచేశాయి. బ్లేడ్ రన్నర్, డ్యూన్, హారీపోటర్ వంటి సినిమాలకు పనిచేసిన వారు ఈ సినిమా కోసం పనిచేశారు.
దీంతోపాటు అత్యంత నాణ్యమైన విజువల్స్ కోసం అత్యాధునిక కెమెరాలను వినియోగించారు. ఐ మ్యాక్స్ డిజిటల్ కెమెరాతో షూటింగ్ చేశారు. యారి లెన్స్‌తో 6.5K రిజల్యూషన్‌తో షూటింగ్ చేశారు. ఫలితంగా క్వాలిటీ పరంగా అత్యంత క్లియర్‌గా ఉంటుంది. ఈ సినిమాలో వినియోగించిన బుజ్జి వాహనాన్ని ఏకంగా రూ.4 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించారు. మహీంద్రా సంస్థ ఇందులో కీలకంగా వ్యవహరించింది.
అయితే కల్కి 2898 AD సినిమా కంటే అనేక సినిమాలు భారీ స్థాయిలో VFX టెక్నాలజీని ఉపయోగించాయి. 2011 లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన Ra.one మూవీలో అత్యాధునిక గ్రాఫిక్స్‌ను వినియోగించారు. దీంతోపాటు 2013 లో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 లోనూ అత్యాధునిక VFX ను ఉపయోగించారు.
దీంతోపాటు 2016లో అజయ్ దేవగన్ శివాయ్ సినిమాలో కూడా కొన్ని షాట్స్ కోసం VFX ను వినియోగించారు. పర్వతం మీద నుంచి హీరో మంచులోకి పడిపోవడం వంటి షాట్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. మరియు ప్రపంచం అంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన బాహుబలి పార్ట్ 2 (2017) ను భారీ స్థాయిలో VFX గ్రాఫిక్స్‌ను వినియోగించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబో 2.0 చిత్రంలో అనేక యాక్షన్ సీన్స్‌ను VFX ద్వారా రూపొందించారు. 2018లో ఈ సినిమా రిలీజ్ అయింది. మరియు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR (2022) సినిమాలో పులితో ఫైట్ సీన్, యాక్షన్, సహా అనేక సన్నివేశాల కోసం VFX ను వినియోగించారు. దీంతోపాటు 2022లో విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా కూడా VFX ను వినియోగించారు.


Click it and Unblock the Notifications