Home
News

అకౌంట్లో రూ.12 లేకుంటే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మిస్సవుతారు

మధ్య తరగతి జీవులకు అకౌంట్లో డబ్బులు ఉంచాలంటే చాలా కష్టమైన పనే. నెలవారీ ఖర్చులకే వచ్చిన జీతం సరిపోతుంటే ఇక బ్యాంకులు దాచుకునేందుకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి. అయితే ఇప్పుడు తప్పనిసరిగా బ్యాంకులో...

మధ్య తరగతి జీవులకు అకౌంట్లో డబ్బులు ఉంచాలంటే చాలా కష్టమైన పనే. నెలవారీ ఖర్చులకే వచ్చిన జీతం సరిపోతుంటే ఇక బ్యాంకులు దాచుకునేందుకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి. అయితే ఇప్పుడు తప్పనిసరిగా బ్యాంకులో డబ్బులు ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నుంచి అందుకునే బెనిఫిట్స్ కోసం అకౌంట్లు మినిమం రూ.12 బ్యాలన్స్ ఉండేలా చూసుకోవాలి.

అకౌంట్లో రూ.12 లేకుంటే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మిస్సవుతారు

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అనేక రకాల స్కీములు మీకు అందాలంటే మీకు అకౌంట్లో రూ. 12 ఉండాలని చెబుతున్నారు. అదెలాగో ఓ సారి చూద్దాం.

  మే 31న అకౌంట్ల నుంచి డబ్బులు డెబిట్

మే 31న అకౌంట్ల నుంచి డబ్బులు డెబిట్

మే 31న మీ అకౌంట్‌లో కొంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో మీకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పాలసీల ప్రీమియం మే 31న అకౌంట్ల నుంచి డెబిట్ అవుతుంది. బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు దీనికి సంబంధించి అలర్టులు పంపాయి.
ఒకవేళ మీ అకౌంట్‌లో మే 31న డబ్బులు లేకపోతే మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) స్కీమ్స్ ప్రయోజనాలు పొందలేరు.

రూ.2 లక్షల కవరేజ్

రూ.2 లక్షల కవరేజ్

పీఎంఎస్‌బీవై కింద పాలసీదారులకు రూ.2 లక్షల కవరేజ్ లభిస్తుంది. దీనికి సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యానికి రూ.1 లక్ష ఇన్సూరెన్స్ మొత్తం వస్తుంది. పీఎంజేజేబీవై అనేది జీవిత బీమా పాలసీ. పాలసీదారుడు చనిపోతే నామినీకి రూ.2 లక్షలు అందుతాయి. 55 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. దీనికి వార్షిక ప్రీమియం రూ.330గా ఉంది.

 ప్రారంభం ఎప్పుడు ?

ప్రారంభం ఎప్పుడు ?

ప్రధాన్‌మంత్రి సురక్షాబీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాన్ని మొదటిసారి 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించారు. దేశంలో కేవలం 20శాతం మందికి మాత్రమే ప్రమాద బీమా ఉండటంతో ఈ పరిస్థితిని మార్చేసేందుకు ఈ కొత్త బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015 మే 9న కోల్‌కతాలో ప్రారంభించారు.

అర్హులు ఎవరు ?

18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ బీమా, పింఛన్‌ పథకాలకు అర్హులు. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకుల్లో తెరిచిన ఖాతాలను ఈ బీమా యోజన పథకానికి అనుసంధానించారు.వార్షిక చందా రూ.12తో ఈ పథకం ద్వారా లబ్ధిపొందొచ్చు. 2016 ఫిబ్రవరి నాటికి ఈ పథకంలో 12,47,38,419 మంది చేరారు.సమీపంలోని తపాలా కార్యాలయాల్లో సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు.

 పీఎంజేజేబీవై

పీఎంజేజేబీవై

పీఎంజేజేబీవై(ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన) పథకానికి 18 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈ పథకానికి ఏడాదికి రూ 330 ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో చేరాలంటే ఏటా జూన్‌ 1 నుంచి మే 31లోగా ఏ కారణంలో మరణించినా బీమా వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా సంబంధిత నామినీకి రూ రెండు లక్షల రూపాయలు అందుతుంది

 పీఎంఎస్‌బీవై

పీఎంఎస్‌బీవై

పీఎంఎస్‌బీవై(ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వారెవరైనా చేరొచ్చు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ఈ బీమా చేయించుకున్న వారు ప్రమాదవశాస్తు మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యానికి గురైనా రూ.రెండు లక్షల పరిహార పొం దొచ్చు. పాక్షిక అంగవైకల్యానికి లక్ష రూపాయలు అందజేస్తారు.

అటల్‌ పింఛను యోజన స్కీమ్

అటల్‌ పింఛను యోజన స్కీమ్

ఏపీవై (అటల్‌ పెన్షన్‌ యోజన) 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆటో వర్కర్లు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ స్కీములో చేరి నెల నెలా కొంత పింఛను పొందొచ్చు. నెలకు రూ.1000 నుంచి రూ.5వేల వరకు పింఛను పొందే అవకాశం ఈ స్కీములో ఉంది. రూ 1000 పెన్షన్‌ పొందాలంటే నెలకు రూ 42, రూ 5వేలు పొందాలంటే నెలకు రూ 210 ప్రీమియం చెల్లించాలి

More from GizBot

Best Mobiles in India

English summary
Alert! You may lose Rs 2,00,000 insurance cover!Here pradhan mantri suraksha bima yojana jeevan jyoti bima yojana pmsby pmjjby premium benefits explained
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X