Prasar Bharati OTT ఓటీటీ యాప్‌ను విడుదల చేసిన ప్రసార భారతి.. 12 భాషల్లో కంటెంట్..!
భారత్ లో ఓటీటీల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్ విలీనం అనంతరం జియోస్టార్ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చింది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ ప్రసార భారతి సొంత ఓటీటీ యాప్ ను (Prasar Bharati OTT) విడుదల చేసింది. వేవ్స్ (Waves) పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 భాషల్లో కంటెంట్ ను అందిస్తుందని తెలిపింది. 'ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కి నయి లెహర్' ట్యాగ్‌లైన్ తో లాంచ్ చేసింది.
వేవ్స్ ఓటీటీ విడుదల :
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ప్రారంభ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. వేవ్స్ ఓటీటీ (Waves OTT) ప్లాట్‌ఫాం ను ప్రారంభించారు. ఈ యాప్ ఇన్ఫోటైన్‌మెంట్, గేమింగ్, ఎడ్యుకేషన్, షాపింగ్ సహా మరిన్ని విభాగాల్లో కంటెంట్ ను అందిస్తుంది

12 భాషల్లో కంటెంట్, 65 లైవ్ టీవీ ఛానళ్లు :
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ సహా మొత్తంగా 12 భాషల్లో కంటెంట్ ను అందిస్తుందని ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు 65 లైవ్ టీవీ ఛానళ్లు, ఫ్రీ టు ప్లే గేమ్ లు, వీడియో ఆన్ డిమాండ్ సహా ONDC సాయంతో ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేసేందుకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించింది. భారత్‌నెట్ ద్వారా కంటెంట్ యాక్సెస్ అందిస్తుందని తెలిపింది.
వన్ స్టాప్ హబ్‌గా వేవ్స్ : ప్రసార భారతి ఛైర్మన్
కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందించగలిగే కంటెంట్ ను వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రసార భారతి ఛైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, ఎడ్యుకేషన్ కు వేవ్స్ వన్ స్టాప్ హబ్ గా ఉంటుందని సెహగల్ అన్నారు.
దూరదర్శన్, ఆకారవాణి ఆర్కెవ్స్ :
భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ యువత, పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా చూసేందుకు వీలుగా క్లీన్ కంటెంట్ ను అందిస్తామని ప్రసార భారతి ఛైర్మన్ తెలిపారు. ఈ వేవ్స్ ద్వారా దూరదర్శన్, ఆకారవాణి ఆర్కెవ్స్ ను చూసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కొంకణి భాషలోనూ కంటెంట్ ను అందిస్తుంది.
ప్రసార భారతి ఓటీటీ ప్లా్ట్‌ఫాం వేవ్స్ లో ఇండియా టుడే, ఏబీవీ న్యూస్, న్యూస్24, ఎన్‌డీటీవీ, రిపబ్లిక్ టీవీ, న్యూస్ నేషన్, 9x మీడియా, ఎస్‌ఏబీ, బీ4యూ, ABZY సహా మరెన్నో ఛానళ్లు చూడవచ్చు. మన్ కీ బాత్, అయోధ్య రామ్ మందిర ఆర్తీ, యూఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను చూసేందుకు వీలుంది. సైబర్ సెక్యూరిటీ అవగాహన కోసం CDAC తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రస్తుతం భారత్ లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో స్టార్ సహా అనేక ప్రముఖ ఓటీటీ లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రసార భారతి వేవ్స్ ఓటీటీ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS స్టోర్ లతో అందుబాటులో ఉందని ప్రసార భారతి ప్రకటనలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications