ఆడ్వాన్స్ బుకింగ్ మొదలు!!

Posted By: Staff

ఆడ్వాన్స్ బుకింగ్ మొదలు!!

 

జూన్ మొదటి వారంలో లాంచ్ కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌3కి సంబంధించి ప్రీ బుకింగ్‌లను సామ్‌సంగ్ ఇండియ ఆహ్వానిస్తుంది. ఆడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వారు ముందస్తుగా నామినల్ రుసుము కింద రూ.2.000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన రెండు వారల్లోనే 9 మిలియన్ల ప్రీ ఆర్డర్లను దక్కించుకున్న గెలాక్సీ ఎస్3 అంతకు ముందు రికార్డులు నెలకొల్పిన గెలాక్సీ ఎస్2, గెలాక్సీ నోట్‌లను వెనకకు నెట్టింది. ఆడ్వాన్స్ బుకింగ్‌లో భాగంగా రూ. 2,000 చెల్లించిన వినియోగదారులకు రహస్య కోడ్‌తో కూడిన కూపన్‌ను అందచేయటం జరుగుతుంది.

అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో సుసంపన్నమైన ‘గెలాక్సీ ఎస్3’ జూన్ తొలివారం నుంచి ఇండియాలో లభ్యం కానుంది. యూరోప్‌లో మే29నే ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది.  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 16జీబి, 32జీబి, 64జీబి మెమెరీ వేరింయట్‌లలో లభ్యం కానుంది. రూ.38,000 నుంచి రూ.42,500 ధరల మధ్య వీటిని విక్రియించనున్నారు. ప్రత్యేకించి ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ కోసం సామ్‌సంగ్ పలు ఉపకరణాలను లాంచ్ చేసింది. ఈ జాబితలో ఎస్ పెబ్బిల్ ఎంపీత్రీ ప్లేయర్, వైర్ లెస్ ఛార్జింగ్ కిట్, బ్యాటరీ స్టాండ్ తదితర అంశాలు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot