విడుదలకు ముందే ఆడ్వాన్స్ బుకింగ్!

Posted By: Staff

విడుదలకు ముందే ఆడ్వాన్స్ బుకింగ్!

2012 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయమైన సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ బీమ్ ప్రాజెక్టర్’అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శక్తివంతమైన 15 లూమిన్ ప్రాజెక్టర్ ప్రత్యేకతను కలిగిన ఉన్న ఫోన్ ద్వారా వీడియో ఇతర డేటా కంటెంట్‌ను

గోడ లేదా పైకప్పు వంటి సమతల ఉపరితలాల పై ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.

ఇండియాలో గెలాక్సీ బీమ్ ప్రాజెక్టర్ ఫోన్ ఎప్రిల్‌లో విడుదలవుతుందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఏప్రిల్ నాటికి ఈ ఫోన్ విడుదల కాకపోవటంతో అవన్నీ వట్టి మాటలని తేలిపోయింది. దేశీయ విపణిలో ఈ ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించనప్పటికి

సామ్‌సంగ్ ఈ-స్టోర్ ప్రీబుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ధర రూ.29,900.

సామ్‌సంగ్ గెలాక్సీ బీమ్ ఫీచర్లు:

4 అంగుళాల WVGA TFT స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్ద్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

5 మెగాపిక్సల్ కెమెరా(ఫ్లాష్),

802.11 b/g/n వై-ఫై కనెక్టువిటీ,

2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (1200 నిమిషాల టాక్ టైమ్ (2జీ), 575 నిమిషాల టాక్ టైమ్ (3జీ)).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting