‘గెలాక్సీ నోట్ 2’ను ముందుగా బుక్ చేసుకునే ఛాన్స్!

ఇటీవల బెర్లిన్‌లో సౌత్ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్‌చే ఆవిష్కరించబడిన ‘గెలాక్నీనోట్ 2’ యూవత్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫాబ్లెట్ ప్రత్యేకతలు గురించి మార్కెట్ వర్గాల్లో వాడివేడిగా చర్చించుకుంటున్నారు. ఆవిష్కరణ సమయంలో ఈ డివైజ్ విడుదల అక్టోబర్‌లో ఉంటుందని వెల్లడించినప్పటికి ‘జీఎస్ఎమ్ యరీనా’(GSMArena) బహిర్గతం చేసిన తాజా సమాచారం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ టెక్ పోర్టల్ వెల్లడించిన వివరాల మేరకు గెలాక్సీ నోట్ 2 సెప్టంబర్ 22న విడుదలవుతుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) గెలాక్సీ నోట్2కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ధర రూ. 38,500.
జీఎస్ఎమ్ఏ రిపోర్ట్ ఆధారంగా గెలాక్సీ నోట్ 2కు సంబంధించిన కీలక వివరాలు:
- సెప్టంబర్ 22న గెలాక్సీ నోట్ 2ను విడుదల చేస్తారు. భారత్‌లో వీటి విక్రయాలు 24 లేదా 25 నుంచి ప్రారంభమవుతాయి.
- గ్రే ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లో గెలాక్సీ నోట్ 2 ఫాబ్లెట్ లభ్యంకానుంది. త్వరలో బ్రౌన్ కలర్ వర్షన్ కూడా లభ్యమవుతుంది.
గెలాక్సీ నోట్ 2 కీలక స్పెసిఫికేషన్‌లు:
5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే ఎస్-పెన్ సపోర్ట్,
స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications