దేశంలో పెచ్చుమీరిన కుంభకోణాలపై విప్రో చైర్మన్‌ ఆందోళన

Posted By: Super

దేశంలో పెచ్చుమీరిన కుంభకోణాలపై విప్రో చైర్మన్‌ ఆందోళన

గడచిన సంవత్సర కాలంగా దేశంలో పెచ్చుమీరిన కుంభకోణాలపై ఐటీ దిగ్గజం అజీంప్రేమ్‌జీ ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా పలు కుంభకోణాలు వెలుగు చూడడం బాధ కరమన్నారు. రాజకీయాల్లో మంచి నాయకత్వం, ఉద్యో గి స్వామ్యం, వ్యాపారం, సమాజం వంటివి మాత్రమే దేశం లో అవినీతిని నిర్ములించడానికి దోహదపడుతుందన్నారు. గడచిన సంవత్సర కాలంగా మనం వరుస కుంభకోణాల ను చూస్తున్నాం. టెలకాం స్కాం, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ స్కార, మెడికల్‌ రిక్యూట్‌మెంట్‌ స్కార ఇలా చాలా చూస్తున్నాం. ఇవ న్నీ అంతం కావాలంటే సమాజం నుంచే నాయకత్వం రావా లి. రాజకీయాలు, ఉద్యోగిస్వామ్యం రెండు కూడా చాలా ప్ర దానమైనవి.వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో నాయకత్వం రావాలి అన్నారు. విప్రో చైర్మన్‌ అయిన అజీం ప్రేమ్‌జీ ఈ సందర్భంగా భారతీయ మీడియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అమెరికా మీడియాతో పోలిస్తే భారతీయ మీడియా ఇటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. నిర్ధిష్టమైన అంశానికి సంబంధించి సమ గ్రమైన సమాచారం ఇవ్వాని ఆయన సూచించారు. భారతీయ మీడియా సంఘటలను కేవలం హెడ్‌లైన్స్‌లో ఈవాళ రేపు ఇచ్చి ఊర్కుంటుందని, అదే అమెరికన్‌ న్యూస్‌ పేపర్లు సంఘటనకు సంబంధించి ముగింపును ఇవ్వడంతో పాటు సమాజంలోని అవినీతిని శిక్షించేట్లు హామీని కూడా ఇవ్వగలదని ఆయన అన్నారు. చెనైలోని గ్రేట్‌ లేక్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్నాతకోత్సవంలో ఆయన ఉపన్యసించారు.

సమాజంలోని ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయం ఈ దేశానికి తెలుసున ని, కానీ మొత్తం విధానమే పూర్తిగా మారిపోయిందని, విద్యా ర్థులు దీన్ని సెన్సిటివ్‌గా తీసుకుంటారని ప్రేమ్‌జీ అన్నారు. ఈ సందర్భం గా ఆయన గ్రాడ్యుయేట్‌ పూర్తయిన విద్యార్థుల కు డిప్లామాలను అందజేశారు. ప్రస్తుతం భారతదేశాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎవరో వస్తారను కోద్దని, ప్రస్తుత యువత రం ఈ విషయాలపై బలంగా నిలబడాలని సూచించారు. ఈ ప్రక్షాళన చేపట్టనట్లయితే వచ్చే తరం కూడా ఈ సమస్యల మధ్యనే జీవించాల్సి ఉంటుందని, అందుకే మనం నీతి నిజాయితీ వంటి సూత్రాలను పాటించడంతో పాటు వాటి కోసం బలంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot