ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జి నిలిపివేత..!

Posted By: Prashanth

ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జి నిలిపివేత..!

 

అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఐతే ఇప్పుడు ఆ ఆశ్చర్యకరమైన వార్త ఏమిటని అనుకుంటున్నారా.. సెల్‌ఫోన్ అధికారులకు ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఖాతా కలిగి ఉన్న మొబైల్ ఫోన్ వినియోగదారులకు సరైన డాక్యుమెంట్స్ లేని పక్షంలో వారికి మొబైల్ రీచార్జ్ చేయకూడదనే నిర్ణయం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ ఆర్డర్ని నిర్దేశించింది కాశ్మీర్ పోలీస్ శాఖ.

ఇక వివరాల్లోకి వెళితే ప్రీపెయిడ్ ఖాతాదారులకు రీఛార్జ్ చేసే క్రమంలో మొబైల్ చందాదారుల యొక్క ప్రామాణికతను ధ్రువీకరించాలని కోరారు. ఇందుకు కారణం పోలీసు తనిఖీలలో కొంత మంది మొబైల్ యూజర్స్ అనధికార ఉపయోగం & దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశ్యంతో ఈ పని చేశామని తెలిపారు. అంతేకాకుండా ప్రీపెయిడ్ ఖాతా రీఛార్జ్ వివరాలను తప్పనిసరిగా రికార్డుల మాదిరి నిర్వహించాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఐతే రిటైలర్స్ మాత్రం ప్రీపెయిడ్ మొబైల్ ఖాతాలను గురించి వెళ్లడించలేమని తెలిపారు.

పోలీసులు జారీ చేసిన ఆర్డర్స్‌ని మరింత కఠినంగా అమలు పరచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాజధాని శ్రీనగర్‌లో మొబైల్ డీలర్స్ యూజర్స్ యొక్క ప్రామాణికత పత్రాలు సరైన ఉంటేనే మొబైల్ ఖాతాలకు రీఛార్జి చేస్తున్నారు. అలా లేని పక్షంలో రీఛార్జి నిరాకరిస్తున్నారు. దీంతో ఎవరైతే వయసులో పైబడిన వారు వృద్దులు ఉన్నారో వారి యొక్క మొబైల్ రీఛార్జి చేయించుకునేందుకు గంటల తరబడి క్యూలో నించోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక గతంలో జమ్మూ & కాశ్మీర్‌లో ఉన్న ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు మేసేజ్ ఫీచర్స్‌ని నిషేధించిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot