త‌క్కువ ధ‌ర‌లో డైలీ 2GB డేటా కావాలంటే.. అదిరిపోయే Prepaid Plans ఇవే!

|

భార‌త్‌లో ప్ర‌స్తుతం ప్రధాన టెలికాం ప్రొవైడర్లు అయిన Airtel, Jio మరియు Vi నుండి అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ టెలికాం సేవ‌ల్ని ఎంచుకోవాల‌నేది నిర్ణ‌యించుకోవ‌డానికి డేటా ప్రయోజ‌నాలు, వ్యాలిడిటీ, స్ట్రీమింగ్ సేవలు, కాల్ నాణ్యత మరియు SMS వంటివి ప్రధాన కారకాలుగా ఉంటాయి. కాబ‌ట్టి, ప్రీపెయిడ్ ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్‌లు ఆయా ప్లాన్ల ప్ర‌యోజ‌నాల గురించి వివ‌రంగా తెలుసుకోవ‌డం ద్వారా కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు.

 
త‌క్కువ ధ‌ర‌లో డైలీ 2GB డేటా కావాలంటే.. అదిరిపోయే Prepaid Plans ఇవే!

ఈ క్ర‌మంలో Airtel, Jio మరియు Vi నుండి 2GB రోజువారీ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సంబంధించిన వివ‌రాల‌ను ఇక్క‌డ మీకోసం మేం అందిస్తున్నాం. ఈ ప్లాన్లు ప‌లు విధాలుగా యూజ‌ర్ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. ఒక‌వేళ మీరు కూడా డైలీ 2జీబీ డేటా అందించే ప్లాన్ కోసం చూస్తుంటే.. వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Airtel అందిస్తున్న‌ 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

Airtel అందిస్తున్న‌ 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

Airtel నుండి 2GB రోజువారీ డేటా అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. విభిన్న ధరలతో అనేక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ.319 (1 నెల వ్యాలిడిటీ), రూ.359 (28 రోజుల వ్యాలిడిటీ), రూ.499 (28 రోజుల వ్యాలిడిటీ), రూ.549 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.839 (84 రోజుల వ్యాలిడిటీ), మరియు రూ.2999 (365 రోజుల వ్యాలిడిటీ) ప్లాన్లు ఉన్నాయి.

ఈ ప్లాన్లన్నీ 100 రోజువారీ SMS మరియు అపరిమిత కాల్‌లను అందిస్తాయి. ఈ ప్లాన్‌లలో ప్రతి ఒక్కటి అందించే స్ట్రీమింగ్ సామర్థ్యాలు మరియు వ్యాలిడిటీ వాటి ప్రాథమిక తేడాలు. రోజుకు 2GB డేటాను వినియోగించుకున్న తర్వాత నెట్ వేగం కూడా 64 Kbpsకి తగ్గుతుంది. ఒక రోజులో 100 SMS పంపిన తర్వాత, ప్రతి అదనపు SMSకి దేశీయంగా రూ. 1 మరియు అంతర్జాతీయంగా రూ. 1.5 అవుతుంది. Airtel 2GB డైలీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ రూ.100 క్యాష్‌బ్యాక్, Apollo 24/7 సర్కిల్, Hellotunes, Wynk Music మరియు FASTagకి ఉచిత 3-నెలల యాక్సెస్‌తో పాటు అదనంగా 3-నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం మరియు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను అందిస్తోంది.

Jio అందిస్తున్న‌ 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు:
 

Jio అందిస్తున్న‌ 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

Jio నుంచి కూడా 2GB రోజువారీ డేటా అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ.249 (23 రోజుల వ్యాలిడిటీ), రూ.299 (28 రోజుల వ్యాలిడిటీ), రూ.533 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.719 (84 రోజుల వ్యాలిడిటీ), రూ.799 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.1066 (84 రోజుల వ్యాలిడిటీ), మరియు రూ.2879 (365 రోజుల వ్యాలిడిటీ) వంటి వివిధ ధరల పాయింట్లలో అనేక 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అన్ని ప్లాన్‌లలో అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ SMS మరియు Jio యొక్క సొంత స్ట్రీమింగ్ యాప్‌ల సేకరణ ఉన్నాయి. రూ.1066 మరియు రూ.799 ధర కలిగిన రెండు ప్లాన్‌లు, ఒక్కొక్కటి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటాయి.

Vi అందిస్తున్న‌ 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

Vi అందిస్తున్న‌ 2GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

Vi నుండి ప్రీపెయిడ్ 2GB డైలీ డేటా అందిస్తున్న ప‌లు ప్లాన్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రూ.539 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.839 (84 రోజులు వ్యాలిడిటీ), రూ.499 (28 రోజులు వ్యాలిడిటీ), రూ.319 (1 నెల వ్యాలిడిటీ), రూ.1066 (84 రోజులు వ్యాలిడిటీ) మరియు రూ.3099 (365 రోజులు వ్యాలిడిటీ) ని క‌ల్పిస్తోంది. Vi నుండి ఈ ప్లాన్‌లు అన్నింటిలో రోజుకు 100 SMS, ఉచిత కాల్ స‌దుపాయం, మరియు Disney+ Hotstar ఒక సంవత్సరం సభ్యత్వం కూడా ఉన్నాయి. Vi తన స్వంత స్ట్రీమింగ్ సేవలను, Vi Movies మరియు Vi TVని కూడా అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Prepaid Plans from Jio, Airtel and Vi for 2GB Daily Data Lovers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X