Home
News

రూ.100లోపు నచ్చిన ఆల్‌రౌండర్ ప్లాన్లు, బెస్ట్ ఏదో మీరే చెప్పండి

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టారిఫ్ మరియు కాంబో ప్లాన్స్ ను అందిస్తున్నాయి. అదీకాకుండా టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లన

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టారిఫ్ మరియు కాంబో ప్లాన్స్ ను అందిస్తున్నాయి. అదీకాకుండా టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

రూ.100లోపు నచ్చిన ఆల్‌రౌండర్ ప్లాన్లు, బెస్ట్ ఏదో మీరే చెప్పండి

జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రూ. 100 లో లభిస్తున్న బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

జియో  ప్లాన్లు

జియో ప్లాన్లు

జియో రూ.98 ప్లాన్

రూ.98 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో రోజుకి 2జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం. కాలపరిమితి 28 రోజులుగా ఉంది.

జియో రూ.149 ప్లాన్

పాత ఆఫర్ల గడువు ముగియ నుండటంతో జియో కొత్తగా రూ.149ల ఆఫర్ ప్రకటించింది. ప్రైమ్, నాన్ ప్రైమ్ మెంబర్లు ఇద్దరికి వర్తిస్తుంది. జియో రు. 149 ప్లాన్ కింద జియో ప్రైమ్ యూజర్స్ కి 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది. ఇందులో లోకల్ ఎస్టీడి కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీనిలో ప్రైమ్ యూజర్లకు 2జిబి డేటా కాగా.. నాన్ ప్రైమ్ యూజర్లకు 1జిబి డేటా లభిస్తుంది. 300 ఎస్ ఎమ్ ఎస్ లు కూడా లభిస్తాయి. దీనితో పాటు జియో యాప్ సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ఆపర్లు ఇంకా రానున్నాయి.

 

ఎయిర్‌టెల్ ప్లాన్లు

ఎయిర్‌టెల్ ప్లాన్లు

ఎయిర్టెల్ తాజాగా రూ.99,రూ.119 ప్లాన్ గా రివైజ్ చేసింది.ఈ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వినియోగదారుడికి 2 జీబీ డేటా తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.రూ.119 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ ఒక్కో సర్కిల్‌లో ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రం 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లను 28 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. కొందరు యూజర్లకు మాత్రం 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లు 14 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు తెలిపింది. అయితే, వాయిస్ కాల్స్ విషయంలో ఎటువంటి ఎఫ్‌యూపీ నిబంధన లేదు. అయితే, 2 జీబీ డేటా ప్రయోజనాలు మాత్రం కొందరు యూజర్లకే అందుతున్నాయి.

రూ.98 ప్లాన్

రూ.98 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 3జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం. కాలపరిమితి 28 రోజులు.

రూ.95 ప్లాన్

రూ.95 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 500ఎంబీ డాటాను అందిస్తోంది .ఇందులో 95 టాక్ టైం లభిస్తుంది. లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ కు 1నిమిషానికి 30 పైసలు ఛార్జ్ పడుతుంది . కాలపరిమితి 28 రోజులు.

 

 

వొడాఫోన్ ప్లాన్లు

వొడాఫోన్ ప్లాన్లు

రూ.95 ప్లాన్

రూ.95 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 500ఎంబీ డాటాను అందిస్తోంది .ఇందులో 95 టాక్ టైం లభిస్తుంది అయితే ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్‌ బెనిఫిట్స్ ఉండవు. కాలపరిమితి 28 రోజులు.

వొడాఫోన్ రూ.119 ప్లాన్

ఈ ఏడాది ప్రారంభంలో వొడాఫోన్ రూ.119 ప్లాన్ ప్రారంభించింది. రూ.119 రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం వొడాఫోన్ రూ.139 ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, 5 జీబీ డేటా లభిస్తుంది. ఇక వొడాఫోన్‌కు చెందిన రూ.159 ప్లాన్‌లో 28 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు నెల రోజులకు లభిస్తాయి.

రూ.145 ప్లాన్‌

రూ.145 ప్లాన్‌ను పొందటం ద్వారా 28 రోజుల పాటు వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య కాల్స్ పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్ పిరియడ్‌లో 1జీబి 3జీ డేటా కూడా లభిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు

రూ.75 ప్లాన్ :

యూజర్లు రూ.75 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే 10జీబీ డేటా మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. వీటితో పాటు 500 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా లభిస్తాయి . ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం 15 రోజులు మాత్రమే.టెలికాం రిపోర్ట్ ప్రకారం ఈ BSNL రూ.75 ప్లాన్ కేవలం ఆంద్ర,తెలంగాణ సర్కిల్లో BSNL జీవీత ప్రీపెయిడ్ ప్లాన్ గా అందుబాటులో ఉంది.మరికొన్ని రోజుల్లో ఇతర స్టేట్స్ లో కూడా ఈ ప్లాన్ ను ప్రవేశపెడుతున్నారు

More from GizBot

Best Mobiles in India

English summary
Prepaid recharge under Rs 100: Best all-rounder plans from Jio, Airtel, Vodafone and BSNL
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X