ఎగబడి చూస్తున్న జనం!

Posted By: Staff

ఎగబడి చూస్తున్న జనం!

 

రెండవ సారి అమెరికా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్న బరాక్ ఒబామా తన ఖాతాలో మరో రికార్డును నెలకొల్పారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించిన అనంతరం ఒబామా తన ట్విటర్ ఆకౌంట్ ద్వారా వెలువరించిన ఫోటోతో కూడిన  ట్వీట్  ‘‘Four more years’’కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ మిన్నంటింది. ఈ ట్వీట్‌కు స్వల్ప వ్యవధిలోని 670,000 రీట్వీట్‌లు లభించాయి. 70,000 మంది ఫేవరెట్‌గా మార్క్ చేసుకున్నారు. ఒబామా ట్విట్టర్ నుంచి ఆ ట్వీట్‌కు స్వల్ప సమయం ముందుగా వెలువడిన మరో ట్వీట్  “This happened because of you. Thank you.”కు  200,000 రీట్వీట్‌లు లభించాయి. విజయానందంతో ఒబామా దంపతులు ఆలింగనం చేసుకన్న ఫోటోగ్రాఫ్‌కు 2.1మిలియన్ల ఫేస్‌బుక్ లైక్స్ లభించాయి. ఈ ఛాయా చిత్రం ‘మోస్ట్ లైకుడ్  ఫేస్‌బుక్ ఫోటో’గా ఆల్‌టైమ్ రికార్డులను సృష్టించింది.

‘ఒబామా గెలుపు ఐటీ అవుట్ సోర్సింగ్ ప్రపంచానికి చేదు వార్త’

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా మరోసారి గెలుపొందటం ఐటీ అవుట్ సోర్సింగ్ ప్రపంచానికి శుభపరిణామం కాదని ఐగేట్ సీఈవో ఫనీష్ మూర్తి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒబామా ఇండియా వంటి దేశాలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించటాన్ని విమర్శిస్తూ చేసిన వాగ్థానాలు ముందు ముందు ఐండియా ఐటీ అవుట్ సోర్సింగ్ పరిశ్రమ పై ప్రభావం చూపే అవకాశముందని మూర్తి తెలిపారు. ఇదిలా ఉంటే, ఇండియా ఐటీ పరిశ్రమకు దాదాపుగా 80శాతం ఆదాయం అమెరికా, ఐరోపా దేశాల నుంచే వస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot