‘ఆకాశ్ ట్యాబ్లెట్‌ను రూ.1900కే అందిస్తాం’

Posted By: Staff

‘ఆకాశ్ ట్యాబ్లెట్‌ను రూ.1900కే అందిస్తాం’

 

న్యూఢిల్లీ: ప్రపంచపు చవక ధర ట్యాబ్లెట్ పీసీగా గుర్తింపుతెచ్చుకున్న ఆకాశ్‌ను మరింత తగ్గింపు ధరలో అందుబాటులోకి తెచ్చేందకు కసరత్తులు చేస్తున్నట్లు కేంద్ర ఐటీ, టెలికం మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. బుధవారంలో ఢిల్లీలో జరిగిన రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్‌లో సిబల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆకాశ్ టాబ్లెట్ ధర 49 డాలర్లుండగా.... త్వరలో 35 డాలర్లు (రూ.1900)కే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తరువాతి తరం ఆకాశ్ ట్యాబ్లెట్‌లలో స్కైప్ తదితర అత్యాధునిక

ఫీచర్లను నిక్షిప్తం చేయునున్నట్లు సిబల్ పేర్కొన్నారు. ఈ ఆధునిక స్పెసిఫికేషన్‌లను పీసీలో పొందుపరచటం ద్వారా రూ.7,000 ఖరీదైన టాబ్లెట్ అనుభూతులను నెక్స్ట్ వర్షన్ ఆకాశ్ అందిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 50 లక్షల ట్యాబ్లెట్‌లను తయారు చేసేందుకు వీలుగా క్యాబినెట్ నుంచి అనుమతి పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సిబల్ పీటీఐకు వెల్లడించారు.

ఇంటర్నెట్‌లో వాటికి దాసోహం?

ఇండియా అధికారిక బడ్జెట్ టాబ్లెట్ ఆకాష్-2ను యూకే ఆధారిత సంస్థ డేటావిండ్ రూపొందించింది. విద్యార్థులకు ఈ ఆధునిక టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రత్యేక సబ్సిడీ పై రూ.1130కి విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆకాష్-2 లభ్యంకానుంది.

ఆకాష్ -2 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot