యుట్యూబ్‌లో ప్రధాన మంత్రి కార్యాలయం

Posted By: Staff

యుట్యూబ్‌లో ప్రధాన మంత్రి కార్యాలయం

 

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ 'ట్విట్టర్', సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' ద్వారా ప్రజలకు దగ్గరైన ప్రధానమంత్రి కార్యాలయం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల గురించి మరింతగా వివరించేందుకు గాను సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ 'యూట్యూబ్'ని ఆశ్రయించింది. భారత ప్రదాన కార్యాలయానికి సంబంధించిన వీడియోలన్నింటిని కూడా PMOfficeIndia పేరు మీద ప్రదర్శించనున్నారు.

ఈ వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఉంచడం జరిగింది.  తొలి విడియోను ఇప్పటికే అప్‌లోడ్‌ చేశామని, గత సంవత్సరం అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని రాజ్‌ఘాట్‌ సందర్శనను రెండవ విడియోగా ఉంచామని ప్రకటించారు. ఇక ఈ సంవత్సరం మొదట్లో ప్రముఖ టివి పర్సనాలిటీ పంకజ్‌ పచూరీని సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot