Home
News

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ ప్రారంభం..!

BSNL 4G Launch : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్. 4G నెట్‌వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూసే వారికి ఇది నిజంగా శుభవార్త. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాలోని జర్సుగూడ లో నిర్వహించిన కార్యక్రమంలో BSNL 4G నెట్‌వర్క్‌ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 97,500 మొబైల్‌ 4G టవర్ల, 100 శాతం 4G సాచురేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. పూర్తి దేశీయంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.

సోలార్‌ ఎనర్జీతో :
దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ కోసం సుమారుగా రూ.37 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ టవర్లు అన్నీ సోలార్‌ ఎనర్జీ తో పనిచేస్తాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G నెట్‌వర్క్‌ను తీసుకురావడం ప్రధాని డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా, డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, గ్రామీణ వర్గాలకు సాధికారత కల్పించడమని సంస్థ తమ ప్రకటనలో తెలిపింది.

Prime minister narendra Modi launched BSNL indigenous 4G network full details

క్లౌడ్ ఆధారిత :
స్వదేశంగా అభివృద్ధి చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్ క్లౌడ్ ఆధారితమైనదని అధికారులు తెలిపారు. సులభంగా 5G నెట్‌వర్క్‌ కు అప్‌గ్రేడ్‌ అయ్యే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 97,500 టవర్లను మోడీ ప్రారంభించారు.

మొత్తంగా 97500 టవర్లు :
ఇందులో 92,600 టవర్లకు BSNL ద్వారా. మరో 18,900 టవర్లకు డిజిటల్ భారత్‌ నిధి కార్యక్రమం కింద నిధులు సమకూర్చారు. టెలికాం పరికరాల ఉత్పత్తి. తయారీలో డెన్మార్క్‌, స్వీడన్‌, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.

ఆత్మనిర్భర్‌ భారత్‌ :
బీఎస్‌ఎన్ఎల్ 4G స్వదేశీ సేవలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానం కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నట్లు చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ తో దేశం అభివృద్ది వైపు పరుగులు పెడుతోందని మోడీ అన్నారు.

ఈ సంవత్సరం చివరినాటికి 5G ప్రారంభం కానుందా? :
BSNL 4G ఇవాళ ప్రారంభం కాగా.. ఈ సంవత్సరం చివరి నాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో 5G ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే BSNL 4G ద్వారా సుమారుగా 9 కోట్లకు పైగా ఉన్న యూజర్లకు ప్రయోజనం కలుగుతుంది.

మరింత పుంజుకుంటుందా? :
ఇతర టెలికాం నెట్‌వర్క్‌ లతో పోలిస్తే ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ చాలా తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌ లను అందిస్తోంది. అయితే నెట్‌వర్క్‌ లో వేగం సహా సమస్యలు పరిష్కారం అయితే ఈ ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ యూజర్ల పరంగా మరింత పుంజుకొనే అవకాశం ఉంది.

BSNL 4G నెట్‌వర్క్ కోసం TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), తేజస్ నెట్‌వర్క్‌ తో జతకట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో టెక్నాలజీని అభివృద్ధి చేసింది. త్వరలో 5G నెట్‌వర్క్‌ ను కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో 5G ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Prime minister narendra Modi launched BSNL indigenous 4G network full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X