భారీ డీల్‌కి తెరలేపిన అమెజాన్,ఒకటి కొంటే ఒకటి ఉచితం

Written By:

భారత మార్కెట్లో తొలిసారిగా ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌ కు తెరలేపింది. ఇండియన్ మార్కెట్లో ప్రైమ్‌ డే సేల్‌ను మొట్టమొదటిసారి ప్రారంభించిన అమెజాన్‌ ఇండియా భారీ ఆఫర్లను అందిస్తోంది. గ్లోబల్‌ గా ప్రైమ్‌ డే సేల్‌ సోమవారం సాయంత్రం. 6 గంటలనుంచి ప్రారంభించనుంది.

రానున్న ఫోన్లకు బ్యాటరీ అవసరమే ఉండదట !

భారీ డీల్‌కి తెరలేపిన అమెజాన్,ఒకటి కొంటే ఒకటి ఉచితం

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లను, ఆఫర్లను, డీల్స్‌ను అమెజాన్‌ ప్రకటించింది. 30 గంటల పాటు అంటే రేపు అర్థరాత్రి వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. అయితే ఇది ఎక్స్‌క్లూజివ్‌గా రూ.499తో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న తన ప్రైమ్‌మెంబర్లకు మాత్రమే.

యూజర్లకు దిమ్మతిరిగింది, జియో స్పందన ఏంటంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టీవీ కొనుగోలు చేసిన ప్రైమ్‌ ఖాతాదారులకు

ఈ ఆఫర్ లో భాగంగా టీవీ కొనుగోలు చేసిన ప్రైమ్‌ ఖాతాదారులకు మరో టీవీని ఉచితంగా అందించనుంది. '

20 టాప్ బ్రాండ్లతోపాటు

ప్రైమ్' సేల్‌ లో 20 టాప్ బ్రాండ్లతోపాటు అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనున్నామని అ మెజాన్‌ ప్రైమ్‌ హెడ్‌ అక్షయ్‌ సాహీ చెప్పారు.అయితే భారత్‌ తోపాటు మరో 12 దేశాల్లో ఈ ప్రైమ్‌ డే సేల్‌ నునిర్వహిస్తోంది.

 

సల్మాన్ ఖాన్ బ్రాండ్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ 'బీయింగ్ హ్యూమన్' ఈ- సైకిల్స్ ప్రత్యేకంగా లాంచ్‌ చేయనుంది.

టి.సి.ఎల్ టెలివిజన్ సెట్లలో

అలాగే టి.సి.ఎల్ టెలివిజన్ సెట్లలో మరో 'బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ ' ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రైమ్‌ వినియోగదారులు 4కే ప్యూర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (55 అంగుళాలు) పై టీసీఎల్‌హెచ్‌డీ రెడీ టీవీ (32 అంగుళాలు)ఉచింతగా అందిస్తోంది.

రెడ్‌‌మి 4ను

స్మార్ట్‌ఫోన్లను తీసుకున్నట్లు అయితే, షియోమి రెడ్‌‌మి 4ను ఓపెన్‌ సేల్‌ కింద నేటి సాయంత్రం 5 గంటల నుంచే అందుబాటులో ఉంచనున్నారు. అది ఎక్స్?క్లూజివ్‌గా తన ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే.

వన్‌ప్లస్‌ 5

వన్‌ ప్లస్‌ తాజాగా లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌?ఫోన్‌ కొనుగోలుపైన 2000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ అందించనున్నారు.. ఈ ఆఫర్‌ కేవలం డివైజ్‌ ఎక్స్చేంజ్ చేసుకున్నవారికే. ఇప్పటికే వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలుచేసిన వారికి 19వేల రూపాయల తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది.

మోటోఫోన్లపై రూ.1000 తగ్గింపు

మోటోఫోన్లపై రూ.1000 తగ్గింపును, హానర్‌ 6ఎక్స్‌ స్మార్ట్ఫోన్ పై 3000 రూపాయల తగ్గింపును అమెజాన్‌ ఆఫర్ చేయనుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు యూజర్లకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు యూజర్లకు మరో రూ.2000 తగ్గింపును అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపింది.ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉంటాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Prime Sale: Buy one TV & get one free as Amazon sale starts at 6 PM
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot