Home
News

మొబైల్‌ యూజర్లకు టెలికాం సంస్థలు మరోసారి షాక్‌ ఇవ్వనున్నాయా..?

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా (VI) గత సంవత్సరం జులై లో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను భారీగా పెంచాయి. సుమారు 15 - 25 శాతం వరకు ధరలను పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు ఈ నెట్‌వర్క్‌లకు షాక్‌ ఇచ్చారు. ట్రాయ్‌ లెక్కల ప్రకారం జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్ నెలల్లో ఏకంగా కోటి మందికి పైగా యూజర్లు జియోకు గుడ్ బై చెప్పారు.

మరో సంస్థ ఎయిర్‌టెల్‌కు కూడా యూజర్లు భారీగానే షాక్‌ ఇచ్చారు. అక్టోబర్‌ మినహా ధరల పెంపు అమల్లోకి వచ్చిన జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో భారీ సంఖ్యలో మొబైల్ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అయ్యారు. వోడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ నుంచి భారీ సంఖ్యలో యూజర్లు పోర్టింగ్‌ అయ్యారు.

Private telecom operators may hike tariffs again in 2025 f

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రమే రీఛార్జ్‌ ధరలను పెంచలేదు. దీంతో భారీగా కొత్త యూజర్లు నెట్‌వర్క్‌లో చేరారు. దీంతోపాటు 4G, 5G నెట్‌వర్క్‌ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందనే ప్రకటనలను కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తక్కువ ధరకే మరిన్ని రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

అయితే ప్రైవేటు టెలికాం సంస్థలు జయో, ఎయిర్‌టెల్‌, VI సంస్థలు యూజర్లకు మరోసారి షాక్‌ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో కనీసం 10 శాతం పెంచే అవకాశం ఉందని (Tariff Plans Hike in India) విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు 5G ప్లాన్‌ ధరలను కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫలితంగా ARPU (ఏవరేజ్‌ రెవెన్యూ పెర్‌ యూజర్‌) 25 శాతానికి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు టారిఫ్‌ పెంపుతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి సంవత్సరానికి 15 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై టెలికాం సంస్థలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇప్పటికే మొబైల్‌ యూజర్లు ఛార్జీల పెంపుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి ఛార్జింగ్‌ పెంపుతో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు BSNL 4G నెట్‌వర్క్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ప్రైవేటు టెలికాం సంస్థలకు యూజర్లు మరోసారి షాక్‌ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే ఇప్పటి వరకు టెలికాం సంస్థలు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరియు ఎప్పటి నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి రానుందో ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. 10 శాతం ఛార్జీల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. అయితే BSNL మాత్రం ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది.

దీంతోపాటు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ BSNL ను ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే శరవేగంగా ఏర్పాటు చేస్తోంది. ఈ సంవత్సరం మే నెల నాటికి లక్ష టవర్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇప్పటికే 60 వేలకు పైగా టవర్‌ల ఏర్పాటును పూర్తి చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Private telecom operators may hike tariffs again in 2025 full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X