కోహ్లీ ఒక్క పోస్ట్ చేస్తే రూ.1.35 కోట్లు ఇవ్వాలి,ఇన్‌స్టా‌గ్రామ్ కింగ్‌లు వీరే

By Gizbot Bureau
|

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు వేయడం తెలుసు. కానీ.. మనీ సంపాదించడమేంటని అనుకుంటున్నారా..? ఆ ఒక్క పోస్టుతోనే కోట్లు సంపాదిస్తున్నారు కొంతమంది బ్యూటీలు.. ప్రముఖులు. అందులో మన విరాట్ కొహ్లీ ప్రియాంక చోప్రా లాంటి వారు ఉన్నారు. సెలబ్రీటీలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వాటికి ఎంత చార్జ్‌ చేస్తారనే విషయం పై US కు చెందిన ఓ కంపెనీ 'ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌’పేరుతో ఈ వివరాలను విడుదల చేసింది.

 
Priyanka Chopra, Virat Kohli only Indians on Instagram Rich List 2019 topped by Kylie Jenner.

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్జిస్తోన్న టాప్-100 సెలబ్రిటీల జాబితాలో భారత్ నుంచి కోహ్లితోపాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు మాత్రమే చోటు దక్కింది. ఈ శీర్షికలో భాగంగా ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో ఓ సారి చూద్దాం.

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతోపాటు ఆర్జనలో టాప్‌లో ఉన్నాడు. బీసీసీఐ నుంచి మ్యాచ్ ఫీజు రూపంలోనే కాకుండా.. ఐపీఎల్‌లో ఆడటం, ప్రకటనల్లో నటించడం ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా కూడా కోహ్లి కళ్లు చెదిరే మొత్తం ఆర్జిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌కి 38 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌‌ ఖాతాలో ఒక స్పాన్సర్డ్ పోస్ట్ చేయడానికి రూ. 1,35,66,749 వసూలు చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తోన్న క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం.

 ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ఏదైనా ప్రొడక్ట్‌ను ప్రమోట్‌ చేయడానికి దాదాపు రూ.2కోట్లు సంపాదిస్తోంది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. ఆమె ఒక్క పోస్టుకు 271,000 డాలర్లు తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న ఫాలోయర్ల సంఖ్య 4 కోట్లు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ప్రపంచంలో ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తుల్లో ప్రియాంకది 19వ స్థానం. బాలీవుడ్ నుంచి ఒకే ఒక్క సెలబ్రిటీ.

తొలి స్థానంలో రొనాల్డో
 

తొలి స్థానంలో రొనాల్డో

2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంపాదనలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. 173 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఈ పోర్చుగల్ ప్లేయర్ ఒక స్పాన్సర్డ్ పోస్టుకు రూ.6,73,49,082 వసూలు చేస్తున్నాడు. రొనాల్డో తర్వాతి స్థానంలో నెయమర్, లియోనిల్ మెస్సీ, డేవిడ్ బెక్‌హమ్, లిబ్రోన్ జేమ్స్, రొనాల్డినో, గరిత్ బాలే, జల్టాన్ ఇబ్రహిమోవిక్ ఉన్నారు. వీరింతా ఫుట్ బాల్ ఆటగాళ్లే కావడం గమనార్హం.

 ఆ తర్వాత లిస్టు ఇదే..

ఆ తర్వాత లిస్టు ఇదే..

ఒక్కో పోస్ట్‌కు నెయ్‌మార్‌ రూ.4.98కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచాడు. లియోనల్‌ మెస్పీ రూ.4.47కోట్లు, డేవిడ్‌ బెకారమ్‌ రూ.2.46కోట్లు, లిబ్రాన్‌ జేమ్స్‌ రూ.1.88కోట్లు, రొనాల్డినో రూ.1.76కోట్లు, గారెట్‌ బాలే రూ.1.50కోట్లు, లాటన్‌ ఇబ్రహిమోవిక్‌ రూ.1.38కోట్లు, లూయిస్‌ సారేజ్‌ రూ.1.27 కోట్లు తీసుకుంటూ వరుసగా ఉన్నారు. 15 స్థానంలో అమెరికా రెజ్లర్‌ రోజర్‌ రౌసీ, 16 స్థానంలో టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌లు ఉన్నారు.

Best Mobiles in India

English summary
Priyanka Chopra, Virat Kohli only Indians on Instagram Rich List 2019 topped by Kylie Jenner. Here’s how much they earn

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X