లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

By Sivanjaneyulu
|

కే3 నోట్ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లోకి వచ్చిన కే4 నోట్ శక్తివంతమైన ఫీచర్లతో అలరిస్తోన్న విషయం తెలసిందే. వీఆర్ హెడ్‌సెట్‌ ఆప్షన్‌తో బండిల్ ప్యాక్‌లో అందుబాటులో ఉన్నఈ ఫోన్‌లో హీటింగ్, కనెక్టువిటీ వంటి సాధారణ సమస్యలను గుర్తించినట్లు పలువురు యూజర్లు చెబుతున్నారు. ఈ సాధారణ సమస్యలను సునాయాశంగా పరిష్కరించేందకు పలు సింపుల్ ట్రిక్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

ఫోన్ మెమరీ నిండిపోయిందా..?

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ సాధారణ కండీషన్‌లలోనూ హీటెక్కుతోందని పలువురు యూజర్లు అంటున్నారు. గేమింగ్, బ్రౌజింగ్ వంటివి ఎక్కువ సేపు చేయటం ద్వారా ఈ సమస్య తెలత్తే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఫోన్ ఓవర్‌లోడ్ అవకుండా ఉండాలంటే.. పనికిరాని యాప్స్ ను గుర్తించి వాటిని తొలగించండి. 

 

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ నెమ్మదిగా చార్జ్ అవుతోందని పలువురు యూజర్లు అంటున్నారు. వాస్తవానికి మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. కాబట్టి, మీ కే4 నోట్ ఫోన్ చార్జ్ చేసే క్రమంలో మొదటి ప్రాధాన్యత ఫోన్‌తో వచ్చిన కంపెనీ చార్జర్‌కే ఇవ్వండి. ప్రత్యామ్నాయంగా టర్బో లేదా క్విక్ చార్జర్‌ను ట్రై చేసి చూడండి.

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

మీ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై సమస్యలను ఫేస్ చేస్తున్నారా..? ఇది పెద్ద సమస్యేమి కాదు. ముందుగా మీరు కనెక్ట్ అవ్వాల్సిన వై-ఫై కనెక్షన్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌ను రీఎంటర్ చేసి రీకనెక్ట్ చేయండి. సమస్య దాదాపుగా క్లియర్ అవుతుంది.

 

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

లెనోవో కే4 నోట్‌లో ఆ సమస్యలా..?

మీ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ సమస్యలా..? గేమ్ ఆడుతోన్న సమయంలో ఫోన్ నెమ్మదిగా స్పందిస్తోందా..? అయితే సంబంధింత గేమింగ్ యాప్‌ను మరోసారి రీఇన్‌స్టాల్ చేసి చూడండి. సమస్య పరిష్కారమయ్యే అవాకశముంది.

 

Best Mobiles in India

English summary
Problems and Fixes of the Lenovo K4 Note! [Tips and Tricks]. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X