వైరస్ నుండి రక్షణ కోసం ఫేస్‌బుక్‌ మై పేజి మేకర్

Posted By: Super

వైరస్ నుండి రక్షణ కోసం ఫేస్‌బుక్‌ మై పేజి మేకర్

ఫేస్‌బుక్‌లో వైరస్‌ల బెడద తప్పించుకోవాలంటే MyPageKeeper సర్వీసుని వాడితే సరి. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా విద్యార్థులు, స్టాప్‌దిహ్యాకర్‌ నిపుణులు సంయుక్తంగా తయారు చేశారు. 'రియల్‌ టైం ప్రోటెన్షన్‌ అప్లికేషన్‌'గా ఆకట్టుకుంటున్న ఇది ఉచితం కూడా.

సుమారు 700 మిలియన్ల సభ్యులున్న ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌కి ఇదో కాపలా. మాలిషియస్‌ లింక్స్‌, వైరస్‌లను ఇట్టే పట్టేస్తుంది. ఫిషింగ్‌, స్పాం డేటాని స్కాన్‌ చేసి అప్రమత్తం చేస్తుంది. వాల్‌పై పోస్ట్‌ చేసే పోస్టింగ్‌లను స్కాన్‌ చేస్తుంది. ఈ నిఘాని పొందాలంటే www.mypagekeeper.orgలోకి వెళ్లాలి. అంతకంటే ముందే ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే Go to App ద్వారా వచ్చే పేజీలో Add MyPageKeeper-> Allowను ఎంపిక చేసుకోవాలి. వెంటనే News Feed, Wall posts, Spamming Apps స్కాన్‌ చేసి స్టేటస్‌ని పచ్చ రంగులో You are Secure అని చూపిస్తుంది.

ప్రతి రోజూ కనీసం 600 సైట్లు హ్యాకర్ల దాడులకు గురవుతున్నాయని 'స్టాప్‌దిహ్యాకర్‌' నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాదు Protect your Website, Protect your Reputation అంటూ ఉచిత రక్షణ అందిస్తున్నారు. అందుకు చేయాల్సిందల్లా www.stopt hehacker.comలో సభ్యులవడమే. Sign Up Now క్లిక్‌ చేసి మీ సైట్‌ పేరు, ఈమెయిల్‌తో రిజిస్టర్‌ చేస్తే ప్రతి రోజూ గమనిస్తూ Google Safe Browsing List పంపుతుంది. మీ సైట్‌ 'బ్లాక్‌లిస్ట్‌'లో చేరితే మెయిల్‌ ద్వారా అప్రమత్తం చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot