పీఎస్ఎల్‌వీ సీ-24 విజయవంతం

Posted By:

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం సాయంత్రం చేపట్టిన పీఎస్ఎల్ వీ సీ-24 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ ఐఇర్ఎన్ఎస్ఎస్ 1బీని పీఎస్ఎల్ వీ సీ-24 రాకెట్ కక్ష్యలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావటం పట్ల షార్ శాస్త్రవేత్తలు తమ ఆనందాలను వ్యక్తం చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ముఖ్యంగా సమాచార వ్యవస్థకు ఈ ప్రయోగం దోహదం చేయనుంది. రాకెట్ 1,3 దశల్లో ఘన ఇంధనాన్ని ఉపయోగించగా, 2,4 దశల్లో ద్రవ ఇంధనాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. భారత్ ప్రయోగించిన రెండవ నేవిగేషన్ ఉపగ్రహమిది. వచ్చే జూన్‌లో మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కే. రాధాకృష్ణన్ తెలిపారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/LtdgrcF1nFg?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot