సమాజం ఎటుపోతోంది?గేమ్ ఆపమన్నందుకు పిల్లాడు ఉరేసుకున్నాడు

ఈ మధ్య సంచలనంగా మారిన పబ్‌జి గేమ్ పిల్లల్లో వ్యసనంగా మారింది. ఎందరో పిల్లలు, యువత పబ్‌జి గేమ్‌కు బానిసలవుతున్నారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ గేమ్ గురించి ప్రస్తావించారంటే అర్థం చేసుకోం

|

ఈ మధ్య సంచలనంగా మారిన పబ్‌జి గేమ్ పిల్లల్లో వ్యసనంగా మారింది. ఎందరో పిల్లలు, యువత పబ్‌జి గేమ్‌కు బానిసలవుతున్నారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ గేమ్ గురించి ప్రస్తావించారంటే అర్థం చేసుకోండి ఈ గేమ్ ప్రభావం ఎంతలా ఉందో. పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లకుండా రోజంతా ఈ గేమ్ ఆడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

 
 సమాజం ఎటుపోతోంది?గేమ్ ఆపమన్నందుకు పిల్లాడు ఉరేసుకున్నాడు

దేశంలో అనేక నగరాల్లో ఈ గేమ్‌ను నిషేధించాలని డిమాండ్ కూడా వస్తుంది. గుజరాత్‌లో ఈ గేమ్‌ను పాక్షికంగా నిషేధించారు.

16 ఏళ్ల పిల్లాడు

16 ఏళ్ల పిల్లాడు

మల్కాజిగిరిలోని విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో నివాసముంటున్న భరత్‌రాజ్‌, ఉమాదేవిల రెండో కుమారుడు సాంబశివ(16) పదో తరగతి చదువుతున్నాడు. గత వారం ప్రారంభమైన పదో తగరతి పరీక్షలు.. బుధవారంతో పూర్తికానున్నాయి.

తల్లి మందలించడంతో

తల్లి మందలించడంతో

రాత్రి సాంబశివ ఇంట్లో పబ్జి ఆడుతూ అమ్మకి కనిపించాడు. తెల్లవారితే పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా ఏంచేస్తున్నావని.. తల్లి మందలించడంతో.. ఆవేశంతో ఇంట్లోకి వెళ్లి.. తలుపులు వేసుకున్నాడు. కానీ ఆ తల్లి మందలింపు.. తన కొడుకును దూరం చేస్తుందని అనుకోలేదు.

ఉరేసుకున్నాడు
 

ఉరేసుకున్నాడు

అరగంట తర్వాత కూడా తలుపులు తీయలేదని ఇంట్లో ఏ చప్పుడు రాట్లేదని తలుపు తీసేందుకు తల్లి ప్రయత్నించింది.. రాకపోవడంతో కిటికి సాయంతో ఇంట్లోకి చూడడంతో సాంబశివ కిందపడి ఉన్నాడు. అనుమానం వచ్చి పక్కింటి వాళ్లతో తలుపులు విరగ్గొట్టించి వెంటనే కుమారుడిని ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆలస్యమైందని వైద్యులు తెలిపారు.

తల్లి ఫిర్యాదుతో

తల్లి ఫిర్యాదుతో

బాలుడు తువ్వాలుతో ఉరేసుకున్నాడని బరువు ఎక్కువగా ఉండటంతో అది ఊడి కింద పడిపోయాడని భావిస్తున్నారు. తల్లి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ గేమ్‌కు బానిసై ఇటీవల జగిత్యాలలో ఓ బాలుడు మృతిని చెందిన సంగతి తెలిసిందే.

 పబ్‌జీ గేమ్ డ్రగ్స్ కంటే

పబ్‌జీ గేమ్ డ్రగ్స్ కంటే

పబ్‌జీ గేమ్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనదని మానసిక వైద్యులు చెబుతున్నారంటేనే దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి బానిసలై ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Best Mobiles in India

English summary
PUBG addiction Boy commits suicide after being scolded by mother

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X