PUBGకి బానిసై అన్నం, నీళ్లు కూడా మానేసాడు!! చివరికి ప్రాణాలు కూడా...
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన బాటిల్ రాయల్ గేమ్ లలో PUBG కూడా ఒకటి. ఈ PUBG గేమ్ ను మొబైల్ ద్వారా మరియు కంప్యూటర్ ద్వారా కూడా ఆడటానికి వీలుగా రెండు రకాల వెర్షన్లను కలిగి ఉంది. ఇటువంటి గేమ్ లు జీవితంలో కేవలం ఒక భాగం మాత్రమే కావాలి కానీ అదే వ్యసనం అయితే కనుక జీవితం నాశనం అవుతుంది. ఈ PUBG కి వ్యసనపరుడై ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక బాలుడు చాలా రోజులుగా భోజనాన్ని కూడా వదిలివేసాడు. చివరికి తన జీవితాన్నే వదిలేసాడు.

PUBG గేమ్ వ్యసనం
దీనికి సంబందించిన వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల బాలుడు చాలా రోజులు నిరంతరాయంగా PUBG ఆడుతూ మరణించాడు. అతను PUBG గేమ్ కు ఎంతలా బానిసఅయ్యాడు అంటే ఆటలో మునిగిపోయి అతను చాలా రోజులుగా భోజనం కూడా చేయడం మరచిపోయాడు. ఈ బాలుడు తన భోజనంతో పాటు నీటిని కూడా తీసుకోవడం కూడా మరచిపోవడంతో బాలుడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడని తెలిపారు.

కుటుంబ సభ్యుల వివరాలు
కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు అతనిని తమకు దగ్గరలో ఉన్న ఎలురు టౌన్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన విరేచనాలు కారణంగా అతనికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది అని డాక్టరులు తెలిపారు. కానీ అతను శస్త్రచికిత్స నుండి బయటపడలేకపోయాడు. అతను చికిత్స పొందుతూ హాస్పిటల్ లోనే కన్నుమూశాడు.

CID పోలీసు విచారణ
మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో CID పోలీసు సూపరింటెండెంట్ (SP-సైబర్ క్రైమ్స్) జి.ఆర్. రాధిక మాట్లాడుతూ "సైబర్ నేరస్థులు ఆన్‌లైన్ గేమ్ లను అందించడం ద్వారా పిల్లలను తమ యొక్క కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారు మైనర్లను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. అలాగే వీరిని మాదకద్రవ్యాల పెడ్లింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు" అని తెలిపారు.

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
సైబర్ స్టాకింగ్, బెదిరింపులు, హనీ ట్రాప్, ఆన్‌లైన్ వ్యభిచారం, సైబర్ గ్రూమింగ్, ఇ-కామర్స్, ట్రాప్స్ , ఉద్యోగ మోసాలు, పెళ్ళి సంబంధమైన ఫిషింగ్, OTP మోసాలు వంటి వివిధ రకాల సైబర్ నేరాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత మరియు సాధారణ ప్రజల కోసం సిఐడి నెలలో ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది."

ఇండియాలో PUBG వ్యసనంతో మరణాలు
PUBG వ్యసనం కారణంతో కేసు నమోదు కావడం ఇది కొత్తది కాదు. ఇలాంటి కేసులు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. జనవరిలో 25 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించాడు. దీనికి గల కారణం పరిశీలిస్తే అతను చాలా సేపు PUBG గేమ్ ఆడుతు ఉంటాడు అని తెలిసింది. అలాగే పూణేకు చెందిన హర్షల్ కూడా ఈ గేమ్ ఆడుతున్నప్పుడు తన కుడి చేయి, కాలు కదలకుండా పోయాయని ఫిర్యాదు చేశాడు. సమీపంలోని ఆసుపత్రికి చేరుకున్న తరువాత అతను ఇంట్రాసెరెబ్రల్ రక్తస్రావం తో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. తరువాత అతను చనిపోయాడు.


Click it and Unblock the Notifications








