ఇదేం చోద్యం.. పబ్‌జి ఆడటం కోసమే స్మార్ట్‌ఫోన్స్ కొంటున్నారట

By Gizbot Bureau
|

ఎవరైనా మొబైల్స్ ఎందుకు కొంటారు. కాల్స్ మాట్లాడుకోవటానికి లేకుంటే ఎసెమ్మెస్ లు పంపుకోవడానికే కదా.. అయితే స్మార్ట్ ఫోన్స్ రాకతో వాడకం మరింతగా పెరిగింది. అందరూ సోషల్ మీడియాలో తమ ప్రతాపాన్ని చూపించేందుకు మొబైల్స్ కొంటున్నారు.

The PUBG effect? Indians buying more gaming smartphones

వాట్సప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా యాప్ లలో రోజంతా గడిపేస్తున్నారు. అందుకు బాగా ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్లను కొంటున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. స్మార్ట్‌ఫోన్లను కేవలం పబ్‌జి మొబైల్ గేమ్ ఆగేందుకే కొంటున్నారట.

గేమ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను..

గేమ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను..

పబ్‌జి మొబైల్ గేమ్ ప్రభావం యువత, పిల్లలపై ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ గేమ్ ఆడేందుకు వారు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇప్పుడు ఏకంగా ఆ గేమ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను కొనేస్తున్నారు. స్థోమత ఉన్నవారు తమకు ఇష్టమైన ఫీచర్లు కలిగిన హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తుంటే.. పబ్‌జి వస్తే చాలని చెప్పి కొందరు సాధారణ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లనే కొంటున్నారు.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్

అయితే ఎటు చూసినా.. పబ్‌జి మాత్రమే కాదు, ఇతర మొబైల్ గేమ్స్ వల్ల కూడా ఏటా మన దేశంలో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని పలు సంస్థలు విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం కేవలం గేమ్స్ కోసమే ఫోన్లను కొంటున్న వారి సంఖ్య పెరుగుతున్నదని వెల్లడైంది.

 టైర్ 2, టైర్ 3 సిటీలు
 

టైర్ 2, టైర్ 3 సిటీలు

ముఖ్యంగా గేమింగ్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారట. అలాగే టైర్ 2, టైర్ 3 సిటీలు, పట్టణాల్లో గేమింగ్ కోసం ఆ ఫీచర్లు కలిగిన ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నదని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత స్మూత్‌గా ఉండేలా..

గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత స్మూత్‌గా ఉండేలా..

కాగా వినియోగదారుల కోసమే గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత స్మూత్‌గా ఉండేలా ప్రీమియం ఫోన్లను డిజైన్ చేస్తున్నట్లు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అసుస్, షియోమీ, వన్‌ప్లస్, ఒప్పోలు వెల్లడించాయి. అయితే భవిష్యత్తులో గేమ్స్ కోసమే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాల మీద‌కు

ప్రాణాల మీద‌కు

ఈ వార్త ఇలా ఉంటే ప‌బ్‌జి మొబైల్ గేమ్ రోజు రోజుకీ పిల్ల‌లు, యువ‌త‌ను వ్య‌స‌న‌ప‌రులుగా మారుస్తోంది. దాని మోజులో ప‌డి అన్ని ప‌నుల‌ను వ‌దిలేసి కొంద‌రు రోజుల త‌ర‌బ‌డి ఆ గేమ్ ఆడ‌డంలోనే లీన‌మ‌వుతున్నారు. ప‌బ్‌జి మొబైల్ గేమ్ వ‌ల్ల ప‌లువురు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. మరికొందరయితే ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. వీరంతా గంటల తరబడి మొబైల్‌లో పబ్‌జి గేమ్‌ ఆడుతూ ప్రపంచాన్ని మరచిపోతున్నారు. ఈ ప్రపంచంలోకి రమ్మంటే వారు ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతున్నారు.

Best Mobiles in India

English summary
The PUBG effect? Indians buying more gaming smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X