PUBG ఆడండి, మొత్తం కోటిన్నర గెలవండి

By Gizbot Bureau
|

పబ్‌జి... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆడుతున్న వీడియోగేమ్‌. 'ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌'కు సంక్షిప్తరూపమే పబ్‌జి. 2017లో విడుదలైన ఈ పబ్‌జి గేమ్‌ను దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జి కార్పొరేషన్‌ తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా తన బానిసలుగా మార్చుకుంటున్న వీడియో గేమ్‌ పబ్‌జి. ఇదొక వర్చువల్‌ గేమ్‌.

PUBG India Mobile Tour 2019 announced with a price pool of Rs 1.5 crore

కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో ఒంటరిగా లేదా జట్టుతో కలిసి ఈ ఆటను ఆడొచ్చు. అయితే ఇప్పుడు ఇండియాలో ఈ గేమ్ ఆడుతున్న వారి కోసం పబ్‌జి మొబైల్ గేమ్ టీం ఓశుభవార్తను అందించింది. అదేంటో ఓ సారి చూద్దాం.

  రూ.1.50 కోట్ల వరకు నగదు బహుమతులు

రూ.1.50 కోట్ల వరకు నగదు బహుమతులు

ఈ గేమ్ డెవలపర్ టెన్సెంట్ గేమ్స్‌తోపాటు పబ్‌జి కార్ప్, ఒప్పో ఇండియాలు కలిసి మరో టోర్నమెంట్‌ను భారత పబ్‌జి మొబైల్ గేమ్ ప్రియుల కోసం అందుబాటులోకి తెచ్చాయి. రానున్న 4 నెలల కాలంలో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ ప్లే ఆఫ్ టోర్నమెంట్‌లను నిర్వహించనున్నారు. అనంతరం నిర్వహించే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన వారికి రూ.1.50 కోట్ల వరకు నగదు బహుమతులను అందివ్వనున్నారు.

 ఫ్రైజు మనీ ఇదే

ఫ్రైజు మనీ ఇదే

పబ్‌జి మొబైల్ ఇండియా టూర్ పేరిట నిర్వహించనున్న పబ్‌జి మొబైల్ గేమ్ టోర్నమెంట్‌లో విన్నర్లకు రూ.50 లక్షలు, రెండో ర్యాంక్ సాధించిన వారికి రూ.20 లక్షలు, మూడవ స్థానంలో నిలిచిన వారికి రూ.10 లక్షల నగదు బహమతులను అందిస్తారు. ఇక ఫైనల్ చేరుకున్న ప్రతి టీం (నలుగురు సభ్యులు)కు నగదు బహుమతులను అందిస్తారు.

 రిజిస్టర్ ఎలా ?

రిజిస్టర్ ఎలా ?

ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఉన్న పబ్‌జి మొబైల్ గేమ్ ప్రియులు అయినా పాల్గొనవచ్చు. ఏ గ్రూప్‌లోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఒక్కో పార్టిసిపెంట్ ఒక్క గ్రూప్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే పార్టిసిపెంట్ల పబ్‌జి మొబైల్ గేమ్ అకౌంట్ టైర్ ప్లాటినం 5 ఆపైన ఉండాలి. లెవల్ 20 దాటి ఉండాలి. ప్లేయర్లు http://www.pubgmobile.in/esports/indiatour2019/ లింక్‌ను సందర్శించి అందులో ఇచ్చిన నాలుగు సిటీల్లో ఏ సిటీనుంచైనా ఏదైనా గ్రూపులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆయా నగరాల్లో నిర్వహించే పబ్‌జి టోర్నమెంట్లను ఆడి ఫైనల్‌కు చేరుకోవచ్చు.

 అక్టోబర్ 20వ తేదీన ఫైనల్ మ్యాచ్‌

అక్టోబర్ 20వ తేదీన ఫైనల్ మ్యాచ్‌

కాగా ఈ టోర్నమెంట్లను జైపూర్, గౌహతి, పూణె, వైజాగ్ నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పబ్‌జి టోర్నమెంట్లలో ఇదే అతి పెద్ద టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను అక్టోబర్ 20వ తేదీన కోల్‌కతాలో నిర్వహిస్తారు. అందులో పైన చెప్పిన నాలుగు నగరాలకు చెందిన గ్రూప్‌ల నుంచి 20 అత్యుత్తమ టీంలను ఎంపిక చేసి చివరికి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.

  రిజిస్ట్రేషన్ల గడువు తేదీలు

రిజిస్ట్రేషన్ల గడువు తేదీలు

ఇక ఈ టోర్నమెంట్‌కు గాను ఆయా నగరాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. జైపూర్‌లో ఈ నెల 14వ తేదీ వరకు, గౌహతిలో 28వ తేదీ వరకు, పూణెలో ఆగస్టు 11 వరకు, వైజాగ్‌లో ఆగస్టు 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఆ తరువాత క్వాలిఫైర్, ఆన్‌లైన్ ప్లే ఆఫ్స్, గ్రూప్ ఫైనల్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ మ్యాచ్‌లను వరుసగా 4 నెలల పాటు నిర్వహిస్తారు. అనంతరం అక్టోబర్‌లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

Best Mobiles in India

English summary
PUBG India Mobile Tour 2019 announced with a price pool of Rs 1.5 crore; check out full details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X