PUBG Liteకి రెడీగా ఉన్నారా, దీనిని ఇక ఉచితంగా ఆడేయండి
పబ్ జీ.. ఇండియన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. చిన్నవాళ్ల నుంచి పెద్దాళ్ల వరకు పబ్ జీ అంటే పిచ్చి.ఇప్పుడు క్షణం కూడా పబ్ జీ గేమ్ ఆడకుండా ఉండలేని స్థితికి వచ్చారు. గంటల తరబడి వీడియో గేమ్ ఆడేస్తున్నారు.

పిల్లల చదువు పాడైపోతుందని ఇటీవల పబ్ జీని దేశంలో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తినప్పటికీ పబ్ జీ వీడియో గేమ్ క్రేజ్ తగ్గలేదు.ఇక పబ్‌జి మొబైల్ గేమ్ ప్రియులకు కంపెనీ మరో శుభవార్తను అందించింది. ఇప్పటివరకూ స్మార్ట్ ఫోన్లలో మొబైల్ వెర్షన్ తో ఆకట్టుకున్న పబ్ జీ రాయల్ వీడియో గేమ్.. త్వరలో PC వెర్షన్ లో రాబోతుంది. అదే.. PUBG LITE పీసీ వెర్షన్.

పబ్ జీ లైట్ వెర్షన్ టైటిల్ పేరుతో
ఈ లైటర్ పీసీ వెర్షన్ లో గేమ్ ప్లే ఆప్టిమైజ్ తో పాటు కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో ఇండియాకు రానుంది. పబ్ జీ వీడియో గేమ్ మేకర్లు.. పబ్ జీ లైట్ వెర్షన్ టైటిల్ పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ పీసీ వెర్షన్ తో మేజర్ ఇష్యూలను లైటర్ వెర్షన్ పరిష్కరించేలా డిజైన్ చేస్తున్నారు.

తన ఫేస్‌బుక్ పేజీలో..
దీంతో పబ్‌జి గేమ్‌ను తక్కువ స్థాయి కాన్ఫిగరేషన్ ఉన్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలోనూ ఆడవచ్చు. ఇప్పటికే ఈ లైట్ గేమ్ థాయ్‌లాండ్, హాంగ్ కాంగ్, తైవాన్, బ్రెజిల్, బంగ్లాదేశ్ యూజర్లకు అందుబాటులోకి రాగా త్వరలో భారత్‌లోని యూజర్లకు ఈ గేమ్ లభ్యం కానుంది. ఈ మేరకు పబ్‌జి ఇండియా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ ఇమేజ్‌ను పోస్ట్ చేసింది. కాగా పబ్‌జి లైట్ వెర్షన్ గేమ్‌కు డెడికేటెడ్ జీపీయూ అవసరం లేదు. దీని వల్ల గేమ్ స్మూత్‌గా, తక్కువ స్థాయి కాన్ఫిగరేషన్ ఉన్న పీసీలోనూ రన్ అవుతుంది.

ఉచితంగా డౌన్ లోడ్
లో ఎండ్ పీసీల్లో కూడా మొబైల్ పబ్ జీ గేమ్ ఎక్స్ పీరియన్స్ ఉండేలా రూపొందిస్తున్నారు. రెగ్యులర్ పబ్ జీ తరహాలోనే అన్ని విపన్స్, వెహికల్స్ రకరకాల ఔట్ ఫిట్లతో పబ్ జీ లైట్ వెర్షన్ గేమ్ ప్లే ఒకేలా ఉంటుంది. ఈ గేమ్ ఆడుతుంటే.. రియల్ పబ్ జీ గేమ్ ఆడిన ఫీల్ ఉంటుంది. కానీ, గ్రాఫిక్స్ ఆప్టిమైజేషన్ కాస్త డిఫరెంట్ గా ఉండనుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పబ్ జీ లైట్ వెర్షన్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆడుకోవచ్చు.ఫుల్ పీసీ వెర్షన్ పబ్ జీ లో మాత్రం ఈ సదుపాయం లేదు. కొన్ని సౌత్ ఈస్ట్ ఏసియా దేశాల్లో కొన్ని నెలలుగా పబ్ జీ లైట్ బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లో ఈ పబ్ జీ లైట్ వెర్షన్ వీడియో గేమ్ ఆడాలంటే VPN సర్వీసు తప్పనిసరిగా ఉండాలి.

Fortnite మాదిరిగా
PUBG LITE వీడియో గేమ్ Fortnite మాదిరిగా ఉండనుంది. గేమ్ యూజర్లు తమ PC ల్లో PUBG LITE లాంచర్ ను ముందుగా ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వాడే పీసీలో Low End స్పెషిఫికేషన్లు ఉన్నాయా? PUBG LITE ఇన్ స్టాల్ చేసుకోవాలనుకుంటే కనీస ఈ సిస్టమ్ స్పెషిఫికేషన్లు తప్పనిసరిగా మీ PCలో ఉండాల్సిన అవసరం ఉంది. ఓసారి చెక్ చేసుకోండి.

స్పెషిఫికేషన్లు ఇవే :
పీసీలో విండోస్ 7, 8 లేదా 10 ఓఎస్ (64 బిట్), ఇంటెల్ కోర్ ఐ3 సీపీయూ (2.4 గిగాహెడ్జ్ స్పీడ్), 4జీబీ ర్యామ్, ఇంటెల్ హెచ్‌డీ 4000 గ్రాఫిక్స్, 4జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ ఉంటే సరిపోతుంది. అయితే భారత్‌లో పబ్‌జి లైట్ గేమ్‌ను ఈ నెల చివర్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. అలాగే Intel Core i5 2.4Ghz ప్రాసెసర్ , 8GB ర్యామ్, NVIDIA GeForce GTX 660 , AMD Radeon HD 7870 , 4GB హార్డ్ డ్రైవ్ స్టోరేజీ లలో కూడా రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications